✕
India-Pak War : పాకిస్తాన్‌కు బెయిల్ ఔట్ ప్యాకేజీపై ఐఎంఎఫ్ మల్లగుల్లాలు..!
By ehatvPublished on 9 May 2025 5:37 AM GMT
పాకిస్తాన్ బెయిల్ ఔట్ ప్యాకేజీపై అంతర్జాతీయ ద్రవ్య నిధి బోర్డు ఆలోచనలో పడింది.

x
పాకిస్తాన్ బెయిల్ ఔట్ ప్యాకేజీపై అంతర్జాతీయ ద్రవ్య నిధి బోర్డు ఆలోచనలో పడింది.. 1.3 బిలియన్ డాలర్ల అప్పు ఇవ్వాలా ? వద్దా అనే అంశంపై నిర్ణయం తీసుకోనుంది. కాసేపట్లో ఐఎంఎఫ్(IMF) సమావేశం కానుంది. పాకిస్థాన్(Pakistan)కు ఐఎంఎఫ్ అప్పు ఇవొద్దని భారత్ కోరుతోంది. పాకిస్థాన్‌కు ఎట్టి పరిస్థితుల్లో బెయిల్ అవుట్ ప్యాకేజ్ నిధులు విడుదల చేయవద్దని భారత డిమాండ్ చేస్తోంది. పాకిస్థాన్‌కు నిధులు విడుదల చేస్తే అవి ఉగ్రవాదులకు చేరుతాయని భారత్ (India)స్పష్టం చేసింది. ఉగ్ర స్థావరాలను ఏర్పాటు చేసి భారత్‌పైకి ఎగదోస్తున్న పాకిస్థాన్‌ను అంతర్జాతీయంగా ఏకాకి చేయడమనే లక్ష్యంగా ఇండియా పావులు కదుపుతోంది. మరో వైపు, పాకిస్థాన్ ఐఎంఎఫ్ నుంచి తీసుకున్న నిధులను దారి మళ్లిస్తున్నట్టు తగిన ఆధారాలను కూడా భారత్ సమర్పించిన సంగతి తెలిసిందే.

ehatv
Next Story