ఓ వ్యక్తి క్యాన్సర్‌తో (Cancer) పోరాడుతున్నాడు. గత ఎన్నిదేళ్లుగా ఆయన క్యాన్సర్‌ చికిత్స తీసుకుంటున్నారు. కీమోథెరపీ (Keemo Theropy) ద్వారా నెట్టుకొస్తున్నాడు. చికిత్సకు డబ్బులు మాత్రం విపరీతంగా ఖర్చవుతోంది. దీంతో తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకున్నాడు. ఇందు కోసం భార్య, అతడి స్నేహితుడి దగ్గర డబ్బు తీసుకొని లాటరీ టికెట్ కొంటే ఏకంగా 10 వేలకోట్లకుపైగా పలకడంతో ఆయన ఆనందానికి అవధుల్లేకుండా పోయింది.

ఓ వ్యక్తి క్యాన్సర్‌తో (Cancer) పోరాడుతున్నాడు. గత ఎన్నిదేళ్లుగా ఆయన క్యాన్సర్‌ చికిత్స తీసుకుంటున్నారు. కీమోథెరపీ (Keemo Theropy) ద్వారా నెట్టుకొస్తున్నాడు. చికిత్సకు డబ్బులు మాత్రం విపరీతంగా ఖర్చవుతోంది. దీంతో తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకున్నాడు. ఇందు కోసం భార్య, అతడి స్నేహితుడి దగ్గర డబ్బు తీసుకొని లాటరీ టికెట్ కొంటే ఏకంగా 10 వేలకోట్లకుపైగా పలకడంతో ఆయన ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. వివరాల్లోకి వెళ్తే

లావోస్‌కు (Lavos) చెందిన 46 ఏళ్ల చెంగ్ సైఫాన్‌ (Cheng Saephan) అమెరికాకు (America) వచ్చి స్థిరపడ్డాడు. 2016లో అతనికి క్యాన్సర్‌ అటాక్‌ అయింది. ఇక అప్పటి నుంచి క్యాన్సర్‌ చికిత్స చేయించుకుంటున్నాడు. వైద్య చికిత్స కోసం భారీగా డబ్బులు కావాల్సి వచ్చింది. ఎనిమేదళ్లుగా కీమోథెరపీ చేయించుకుంటున్నారు. ఈ క్రమంలో తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకున్నాడు. పవర్‌బాల్ లాటరీలో (US Powerball) టికెట్ కొనేందుకు భార్య, స్నేహితుడి సాయం తీసుకొన్నాడు. ఆ తర్వాత నిర్వహించిన డ్రాలో ఓ టికెట్ (22, 27, 44, 52, 69)తో సరిపోలడంతో 1.3 బిలియన్‌ డాలర్లు అంటే భారత కరెన్సీ ప్రకారం రూ.10 వేల 8 వందల 42 కోట్లు గెలుచుకున్నాడని పవర్‌ బాల్ లాటరీ నిర్వాహకులు తెలిపారు. పవర్‌ బాల్ చరిత్రోలనే ఇది నాలుగో అతిపెద్ద లాటరీ అని నిర్వాహకులు వెల్లడించారు. పన్ను కింద 422 మిలియన్‌ డాలర్లు అంటే రూ. 3 వేల 5 వందల 22 కోట్లు మినహాయించుకొని మిగతా డబ్బును అతడికి చెల్లిస్తామన్నారు నిర్వాహకులు. ఇంత భారీ మొత్తం లాటరీలో గెలవడంతో చెంగ్‌ సంతోషం వ్యక్తంచేశాడు. ఈ లాటరీ టికెట్‌ కొనేందుకు సాయపడిన భార్య, స్నేహితుడితో డబ్బు పంచుకుంటానని తెలిపాడు. తనకు మెరుగైన చికిత్స కోసం డబ్బులు ఉపయోగించుకంటానని అన్నాడు.

Updated On 3 May 2024 3:34 AM GMT
Ehatv

Ehatv

Next Story