Sex Before Marriage: ఇండోనేషియాలో పెళ్లికి ముందు సెక్స్ చేస్తే ఏడాది జైలు శిక్ష..! అమల్లోకి కొత్త చట్టం..!
In Indonesia, having sex before marriage is punishable by a year in prison..! New law comes into effect..!

ప్రపంచ పర్యాటక కేంద్రంగా పేరొందిన ఇండోనేషియా ఇప్పుడు మరోసారి వార్తల్లో నిలిచింది.ముస్లిం దేశమైన ఇండోనేషియాలో జనవరి 2 నుంచి కొత్త చట్టం అమల్లోకి వచ్చింది. ఈ చట్టం ప్రకారం వివాహానికి ముందు సెక్స్ చేయడాన్ని నేరంగా పరిగణిస్తారు. పెళ్లికి ముందు శృంగారంలో పాల్గొన్న వారికి ఏడాది వరకు జైలు శిక్ష విధిస్తారు. భార్య లేదా భర్త కాని వారితో శృంగారంలో పాల్గొంటే వారిని వ్యభిచార నేరం కింద శిక్షిస్తారు. అయితే దీనిపై భాగస్వామి లేదా తల్లిదండ్రులు లేదా పిల్లలు ఫిర్యాదు చేస్తేనే కేసు నమోదు చేస్తారు. వివాహం చేసుకోకుండా జంటలు సహజీవనం చేయడం లేదా పెళ్లికి ముందు శృంగారంలో పాల్గొనడం తీవ్రమైన నేరంగా పరిగణించబడుతుంది. దీనిని ఉల్లంఘిస్తే ఏడాది వరకు జైలు శిక్ష విధించే అవకాశం ఉంది. కేవలం స్థానికులకే కాకుండా అక్కడికి వచ్చే విదేశీ పర్యాటకులు కూడా ఈ నియమాలను పాటించాల్సి ఉంటుందన్న వార్తలు ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చకు దారితీస్తున్నాయి. నూతన శిక్షాస్మృతిలోని ఆర్టికల్ 411 ప్రకారం.. వివాహం కాకుండా శృంగారంలో పాల్గొంటే గరిష్టంగా ఏడాది పాటు జైలు శిక్ష లేదా భారీ జరిమానా విధిస్తారు. అయితే ఇందులో ఒక కీలక నిబంధన ఉంది. కేవలం బాధితుల జీవిత భాగస్వామి, తల్లిదండ్రులు లేదా పిల్లలు ఫిర్యాదు చేస్తేనే పోలీసులు కేసు నమోదు చేస్తారు. మూడవ వ్యక్తులు లేదా అపరిచితులు చేసే ఫిర్యాదులను పరిగణనలోకి తీసుకోరు.


