Indian War Expense : పాకిస్థాన్‌తో యుద్ధం వల్ల భారత్కు ఒక్కరోజుకు అయ్యే ఖర్చు ఎంతో తెలుసా..?
ఇండియా పాకిస్థాన్ యుద్ధంలో భారత్ తన సైనిక బలగాలు, యుద్ధ నిర్వహణకు చేస్తున్న ఒక్కరోజు ఖర్చు

ఇండియా పాకిస్థాన్ యుద్ధంలో భారత్ తన సైనిక బలగాలు, యుద్ధ నిర్వహణకు చేస్తున్న ఒక్కరోజు ఖర్చు.
అది ఎంతో తెలుసా..?అక్షరాల ఐదువేల కోట్లు.అవును భారత్ లాంటి దేశం ఒక్క రోజు యుద్ధం చేయాలంటే ఖర్చు చేయాల్సిన మొత్తం అది. ప్రస్తుతానికి కాల్పుల విరమణ ద్వారా యుద్దానికి తాత్కాలికంగా బ్రేక్ పడినట్లు కనిపిస్తోంది కానీ మళ్లీ ఉద్రిక్తతలు మొదలైతే అయ్యే ఖర్చే ఇది.
యుద్ధమంటే .. ఫిరంగులు..విమానాలు.. బాంబులే కాదు.. వేల కోట్ల డబ్బు. ఒక దేశం ఒక్కసారి యుద్ధంలోకి దిగిందంటే వారి వారి సామర్థ్యాన్ని బట్టి ఖర్చు చేసుకోవలసిందే.
భారత్ లాంటి భారీ సైనిక సంపత్తి ఉన్న దేశానికి అది చాలా భారీగా ఉంటుంది. యుద్ధం మనం కోరుకుంది కాదు. కానీ అనివార్యమైంది.
యుద్ధం తప్పనిసరైన్పుడు దాని ద్వారా వచ్చే ఖర్చు కూడా తప్పని సరే అవుతుంది. యుద్ధం మిగిల్చే విషాదం ప్రాణనష్టమే కాదు ఇలా ఆర్థిక నష్టం కూడా చాలా ఎక్కువుగా ఉంటుంది.
కేవలం యుద్ధానికి అయ్యే ఖర్చుకే ఇంతలా బెంబేలెత్తుతున్నాం. కానీ ఆర్థిక వ్యవస్థకు జరిగే నష్టం అతిపెద్దది.
రోజుకు 5వేల కోట్లు
యుద్ధం అన్నది రోజులు, నెలలు సంవత్సరాలు కూడా పడుతుంది. ప్రస్తుతం భారత్ -పాక్ మధ్య జరుగుతున్న స్వల్పకాలిక యుద్ధాన్ని దృష్టిలో ఉంచుకుని భారత్ తరపున రోజుకు ఎంత ఖర్చు అవుతుదని దుబయ్ విదేశీ వ్యవహారాల ఫోరమ్ అంచనా వేసింది.
భారత్కు రోజుకు “1460 కోట్ల నుంచి 5వేల కోట్ల ఖర్చు అవుతుందని” ఆ సంస్థ తేల్చింది. 2002-03లో రోజువారీ మిలటరీ వ్యయం 1460కోట్లు.. 2016 లెక్కల నాటికి అది 5000 కోట్లకు చేరుకుంది.
దీర్ఘకాలిక యుద్ధంతో ఆర్థిక వినాశనమే.. 43లక్షల కోట్ల నష్టం
కేవలం స్వల్పకాలిక యుద్ధానికి అయ్యే ఖర్చే ఈ రీతిలో ఉంటే యుద్ధం వల్ల జరిగే పరోక్ష నష్టాలు.. దీర్ఘకాలిక యుద్ధం వల్ల జరిగే పరిణామాలూ చాలా తీవ్రంగా ఉంటాయి.
యుద్ధం వల్ల ప్రస్తుతం రోజుకు 5వేల కోట్లరూపాయల ఖర్చు మాత్రమే మనం అనుకుంటున్నాం.. కానీ ఇది ఇలాగే కొనసాగితే.. ఆర్థిక వ్యవస్థకు కలిగే నష్టం ..
రోజుకు 1 లక్షా ౩4వేల కోట్లు. అదే యుద్ధం ఒక నెలరోజుల పాటు జరిగితే కలిగే నష్టం ఏకంగా 43లక్షల కోట్లు. అంటే మనం జీడీపీలో దాదాపు 20శాతం.
ఒక్క నెల రోజుల యుద్ధానికే తుడిచిపెట్టుకుపోతుంది. దాదాపు 93వేల కోట్ల విదేశీ పెట్టుబడులు వెనక్కు వెళ్లే ప్రమాదం ఉంది. రీటైల్ రంగానికి 4లక్షల ౩5వేల కోట్ల నష్టం జరగనుంది.
యుద్ధమంటే నష్టమే..
యుద్ధంతో జరిగే నష్టాలు అన్నీ ఇన్నీ కావు. యుద్ధంలో సామాన్యుల ప్రాణాలు పోతాయి. దేశ ప్రజల మనోస్థైర్యం దెబ్బతింటుంది. ఆర్థిక రంగం నిలిచిపోతుంది. స్టాక్ మార్కెట్లు కుప్పకూలతాయి. విదేశీ పెట్టుబడులు వెనక్కు వెళ్లిపోతాయి. ఆర్థిక లోట పెరిగిపోయి ధరలు ఆకాశాన్నంటుతాయి.
భారత్ ఇప్పుడు ప్రపంచంలో నాలుగో ఆర్థిక వ్యవస్థగా అవతరించింది. యుద్ధం వల్ల GDPలో 20శాతం పోగొట్టుకోవడం అంటే మన స్థానాన్ని పడగొట్టుకోవడమే.
ఇదే వాతావరణం కొనసాగితే.. రూపాయి విలువ క్షీణించి డాలర్తో పోలిస్తే.. 100రూపాయలకు చేరుకునే అవకాశం ఉంటుంది. దాని ఎఫెక్ట్ అనేక రంగాలపై ఉంటుంది. అన్ని నష్టాలపాలై ఆర్థిక వ్యవస్థకు కోలుకోలేని దెబ్బ తగులుతుంది. దీనికి తోడు మన రక్షణ బడ్జెట్ను రెట్టింపు చేయాల్సి ఉంటుంది.
చారిత్రక యుద్ధాలకు అయిన ఖర్చు :
భారత్ ఇప్పటి వరకూ అనేక యూద్ధాలు చేసింది.
1971 పాకిస్థాన్ యుద్ధంలో వారానికి 200కోట్లు ఖర్చు అయినట్లు అంచనా..
1999 కర్గిల్ యుద్ధంలో సైనిక దళాలకు రోజుకు 10-15 కోట్లు
వైమానిక దాడులకు రు.2000 కోట్లు
మొత్తం కార్గిల్ యుద్ధం ఖర్చు రెండు నెలలకు రు.10వేల కోట్లు.
2001–02 సైన్యం సమీకరణకు రెండు నెలలకు రు.5122 కోట్లు ఖర్చు.
