ప్రపంచంలోనే నాల్గవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిన భారతదేశం నిలిచింది.

ప్రపంచంలోనే నాల్గవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిన భారతదేశం నిలిచింది. బలమైన దేశీయ డిమాండ్, మెరుగైన స్థూల ఆర్థిక సూచికలు, స్థిరమైన సంస్కరణల ఊపుతో, రాబోయే సంవత్సరాల్లో ప్రపంచ ఆర్థిక ర్యాంకింగ్స్‌లో దేశం మరో మెట్టు ఎక్కే దిశగా పయనిస్తోంది.

2014లో 10స్థానంలో ఉన్న భారతదేశం, గత 10 సంవత్సరాలలో దాని ఆర్థిక వ్యవస్థను రెట్టింపు చేసుకుంది, జీడీపీ వృద్ధి రేటును క్రమంగా పెంచుకుంది. 2014లో, భారతదేశం GDP దాదాపు USD 2 ట్రిలియన్ల వద్ద ఉంది. ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలలో 10వ స్థానంలో ఉంది. దశాబ్దం తర్వాత, భారతదేశ GDP USD 4.18 ట్రిలియన్లకు చేరుకుంది, దీంతో జపాన్‌ను అధిగమించింది. ప్రపంచవ్యాప్తంగా నాలుగో స్థానాన్ని పొందింది.

2014లో 10వ స్థానం నుండి ఈరోజు 4వ స్థానం వరకు

యునైటెడ్ స్టేట్స్, చైనా, జపాన్, జర్మనీ, యునైటెడ్ కింగ్‌డమ్ మరియు ఫ్రాన్స్ వంటి దేశాల తర్వాత నిలిచింది. తరువాతి దశాబ్దంలో, 4.18 ట్రిలియన్ డాలర్ల GDP విలువతో భారతదేశం జపాన్‌ను అధిగమించి ప్రపంచంలో నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది. 2030 నాటికి USD 7.3 ట్రిలియన్ల GDP అంచనాతో రాబోయే 2.5 నుండి 3 సంవత్సరాలలో మూడో స్థానంలో ఉన్న జర్మనీని అధిగమించే అవకాశం ఉందని ప్రభుత్వం తెలిపింది. దీంతో వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశంగా భారత్‌ అవతరిస్తుంది.

2014లో దాదాపు 2 ట్రిలియన్ డాలర్లుగా ఉన్న భారతదేశం,P 2025లో 4 ట్రిలియన్ డాలర్లకు పెరిగింది, దీని ఫలితంగా దశాబ్దంలో 100 శాతానికి పైగా జీడీపీ పెరిగింది. పెట్టుబడులు, మౌలిక సదుపాయాల వ్యయం, సేవల రంగం విస్తరణ, వ్యాపార వాతావరణాన్ని మెరుగుపరచడం లక్ష్యంగా విధాన సంస్కరణల ద్వారా ఈ వృద్ధి సాధ్యమైంది. 2025-26 రెండో త్రైమాసికంలో భారతదేశ వాస్తవ GDP 8.2 శాతం వృద్ధి చెందింది, మొదటి త్రైమాసికంలో 7.8 శాతం, గత ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో 7.4 శాతంగా ఉంది. 2025-26 త్రైమాసికంలో GDP విస్తరణ ఆరు త్రైమాసికాల గరిష్ట స్థాయికి చేరుకుందని ప్రభుత్వం తెలిపింది.

Updated On
ehatv

ehatv

Next Story