భారత్-పాకిస్తాన్ మధ్య పరిస్థితి చాలా ఉద్రిక్తంగా యుద్ధం జరుగుతోందని చెప్పలేం.

భారత్-పాకిస్తాన్ మధ్య పరిస్థితి చాలా ఉద్రిక్తంగా యుద్ధం జరుగుతోందని చెప్పలేం. ఏప్రిల్ 22, 2025న జమ్మూ కాశ్మీర్‌(Jammu Kashmir)లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడితర్వాత ఈ ఉద్రిక్తత మొదలైంది. ఈ దాడికి ది రెసిస్టెన్స్ ఫ్రంట్ బాధ్యత వహించింది, దీనికి పాకిస్తాన్(Pakistan) మద్దతు ఇస్తోందని భారత్(India) ఆరోపించింది. ఆపరేషన్ సింధూర్‌(Operation Sindoor)తో మే 7, 2025న భారత్, పాక్-ఆక్రమిత కాశ్మీర్‌లో జైష్-ఎ-మొహమ్మద్, లష్కర్-ఎ-తోయిబా వంటి ఉగ్రవాద స్థావరాలపై క్షిపణి దాడులు చేసింది. భారత్ ఈ దాడులు ఉగ్రవాదులపైనే జరిగాయని, పాక్ సైనిక స్థావరాలను లక్ష్యంగా చేయలేదని చెప్పింది. . మే 10న సాయంత్రం 5:00 గంటల నుంచి కాల్పుల విరమణ ఒప్పందం జరిగినప్పటికీ పాక్‌ మళ్లీ దానిని ఉల్లంఘించింది. భారత్, పాకిస్తాన్ రాయబారులను బహిష్కరించింది, వీసా సేవలను నిలిపివేసింది, సరిహద్దులను మూసివేసింది. పాకిస్తాన్ కూడా భారత్‌పై ప్రతీకార చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. భారత నౌకాదళం బ్రహ్మోస్ క్షిపణులతో కరాచీ సమీపంలో దాడులు, ఇది యుద్ధం తీవ్రతరం అయితే వినాశకరమైన పరిణామాలకు దారితీస్తుందని నిపుణులు హెచ్చరించారు.భారత్‌లో పహల్గామ్ దాడిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది, ప్రతీకారం తీర్చుకోవాలని ప్రజలు కోరుకుంటున్నారు. ప్రస్తుతం పరిస్థితి ఉద్రిక్తంగా ఉన్నా కానీ ఇది పూర్తి స్థాయి యుద్ధంగా మారలేదు. రెండు దేశాలు కాల్పుల విరమణను ఉల్లంఘిస్తున్నాయని ఆరోపిస్తున్నాయి, కానీ అంతర్జాతీయ ఒత్తిడి వల్ల ఉద్రిక్తత తగ్గే అవకాశం ఉంది. ఏదేమైనా, రెండు దేశాలు అణ్వస్త్ర శక్తులు కాబట్టి, పరిస్థితి జాగ్రత్తగా పరిశీలించాల్సిన అవసరం ఉందని అంతర్జాతీయ దేశాలు సూచిస్తున్నాయి.

ehatv

ehatv

Next Story