వాహనం నడిపేందుకు అత్యంత ఇబ్బందికరమైన దేశాల్లో టాప్‌లో ఉందని ఇండియా చాలా సర్వేలు చెబుతున్నాయి.

వాహనం నడిపేందుకు అత్యంత ఇబ్బందికరమైన దేశాల్లో టాప్‌లో ఉందని ఇండియా చాలా సర్వేలు చెబుతున్నాయి. UKలోని Scrap Car Comparison అనే ఆటోమోటివ్ వెబ్‌సైట్ 2,000 మంది డ్రైవర్లతో చేసిన సర్వేలో ఇండియా "స్కేరియస్ట్ కంట్రీ టు డ్రైవ్"గా 7.15/10 స్కోర్‌తో మొదటి స్థానంలో నిలిచింది. ఇండియాలో రోడ్లు చాలా చోట్ల సరిగ్గా లేవు, ట్రాఫిక్ రూల్స్‌ని ఎవరూ పట్టించుకోరు. 2022లో 4,61,312 రోడ్డు యాక్సిడెంట్లు జరిగాయి, అందులో 1,68,491 మరణాలు సంభవించాయి. అంటే గంటకు సుమారు 22 మరణాలు!

కార్లు, బైక్‌లు, ఆటోలు, పాదచారులు, జంతువులు అన్నీ ఒకేసారి రోడ్డుపై ఉంటాయి. సిగ్నల్స్ లేకపోవడం, లేన్ డిసిప్లిన్ లేకపోవడం వల్ల డ్రైవింగ్ చాలా కష్టం. WHO డేటా ప్రకారం, ఇండియాలో రోడ్డు ప్రమాద మరణాలు ఏటా 1,50,785 నమోదవుతాయి, ప్రపంచంలోనే అత్యధికం. అయితే, డ్రైవింగ్ టెస్ట్ విషయంలో ఇండియా చాలా సులభమైన దేశాల్లో ఒకటిగా పరిగణించబడుతుంది. ఇది చాలా సులభం కాబట్టి, లైసెన్స్ తీసుకునే వాళ్లలో చాలామంది సరైన డ్రైవింగ్ నైపుణ్యాలు లేకుండానే రోడ్లపైకి వస్తారు, ఇది మరణాల రేటును మరింత పెంచుతుంది.

2025 మార్చిలో Zutobi సర్వేలో కూడా ఇండియా 53 దేశాల్లో 49వ స్థానంలో నిలిచి, 5వ అత్యంత ప్రమాదకర దేశంగా నిలిచింది. సౌత్ ఆఫ్రికా మొదటి స్థానంలో ఉండగా, నార్వే సురక్షితమైన దేశంగా ఉంది. కాబట్టి, ఇండియాలో డ్రైవింగ్ ఇబ్బందికరంగా ఉండటానికి టెస్ట్ సులభంగా ఉండటం, రూల్స్ లేకపోవడం, రద్దీ, పేలవమైన రోడ్లు ప్రధాన కారణాలు.

ehatv

ehatv

Next Story