భారత్ పాకిస్తాన్‌తో అన్ని రకాల పోస్టల్ సర్వీసులను భారత్ నిలిపివేసింది.

భారత్ పాకిస్తాన్‌తో అన్ని రకాల పోస్టల్ సర్వీసులను భారత్ నిలిపివేసింది. జమ్మూ కాశ్మీర్‌(Jammu and Kashmir)లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడి. ఈ దాడికి పాకిస్తాన్‌(Pakistan)తో సంబంధాలున్నాయని భారత్ ఆరోపిస్తోంది. పహల్గామ్ దాడి(Pahalgam Terror Attack) తర్వాత జాతీయ భద్రత, ప్రజా విధాన ఆధారంగా ఈ చర్య తీసుకున్నారు. దాడిలో పాక్ ఆధారిత ఉగ్రవాదుల ప్రమేయం ఉందని భారత్ భావిస్తోంది. ఎయిర్, సర్ఫేస్ రూట్‌ల ద్వారా అన్ని రకాల ఇన్‌బౌండ్ మెయిల్, పార్సెల్‌ల రాకపోకలు రద్దు చేస్తూ కమ్యూనికేషన్స్ మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. పాక్ జెండాతో ఉన్న ఓడలను భారత ఓడరేవుల్లోకి అనుమతించకపోవడం, భారత ఓడలు పాక్ పోర్టులకు వెళ్లకుండా నిషేధం కొనసాగుతుంది. 2019లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత పాకిస్తాన్ ఏకపక్షంగా పోస్టల్ సర్వీసులను నిలిపివేసింది. అప్పటి నుంచి సర్వీసులు పూర్తిగా సాధారణ స్థితికి రాలేదు. 2020 నుంచి దాదాపు నాలుగేళ్లుగా మెయిల్ ఎక్స్ఛేంజ్ లేదు. రెండు దేశాల మధ్య విడిపోయిన కుటుంబాలకు ఇది ఇబ్బందికరంగా మారింది, ఎందుకంటే గతంలో యుద్ధాల సమయంలో కూడా పోస్టల్ సర్వీసులు కొనసాగాయి. ఈ చర్య భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతలను మరింత పెంచింది. పాకిస్తాన్ ఈ నిర్ణయాలకు బదులుగా తన వైపు నుంచి భారత విమానాలకు ఎయిర్‌స్పేస్ మూసివేసింది, వాణిజ్యాన్ని నిలిపివేసింది

ehatv

ehatv

Next Story