అబుదాబి నుంచి బోస్టన్‌కు బయలుదేరిన ఎతిహాద్ విమానంలో బహిరంగంగా హస్తప్రయోగం చేసినందుకు ఓ భారతీయుడిని అరెస్టు చేశారు.

అబుదాబి నుంచి బోస్టన్‌కు బయలుదేరిన ఎతిహాద్ విమానం(Etihad flight)లో బహిరంగంగా హస్తప్రయోగం చేసినందుకు ఓ భారతీయుడిని అరెస్టు చేశారు.

డిస్ట్రిక్ట్ ఆఫ్ మసాచుసెట్స్ కోర్టు(District Court of Massachusetts) రికార్డుల ప్రకారం, 39 ఏళ్ల కృష్ణ కునాపులి(Krishna Kunapuli) మరో ఇద్దరు ప్రయాణీకుల పక్కన కూర్చున్నప్పుడు ఓ మహిళా ప్రయాణీకురాలి పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. ఆ మహిళ జుట్టును తాకి "నువ్వు చాలా అందంగా ఉన్నావని' అని చెప్పినట్లు ఫిర్యాదు చేశారు. అంతే కాకుండా ఆమె అనుమతి లేకుండా ఆమె ఫొటోలను నిందితుడు తీశాడు. బోస్టన్‌(Boston)లో తనతో ఒక రాత్రి గడపమని మహిళను వేధించినట్లు కేసు నమోదు చేశారు. దీంతో ఆమె మరో సీటుకు వెళ్లిపోయి కూర్చుంది. ఆ తర్వాత అందరి ముందు హస్త ప్రయోగం చేస్తూ తోటి ప్రయాణికులను ఇబ్బంది పెట్టాడు. వారిలో ఒకరు దాని గురించి విమాన సిబ్బందికి తెలియజేశారు. దీంతో సిబ్బంది వెళ్లి చూడగా నిజమేనని తేలింది. అతడు తన ప్యాంట్ విప్పి హస్తప్రయోగం చేసుకోవడం కనిపించింది. దీంతో సిబ్బంది నిందితుడిపై ఫిర్యాదు చేశారు. నిందితుడు కృష్ణ కునాపులికి 90 రోజుల వరకు జైలు శిక్ష, రూ.5,000 జరిమానా వరకు పడే అవకాశముందన్నారు.

Updated On
ehatv

ehatv

Next Story