పారిస్ ఒలింపిక్స్‌(Paris olympics) రెజ్లింగ్‌(wretling) ఫైనల్‌కు చేరిన వినేశ్‌ ఫోగట్‌(Vinesh phogat) స్వర్ణ పతకంతో స్వదేశానికి వస్తుందని సమస్త భారతీయులు ఆశపడ్డారు.

పారిస్ ఒలింపిక్స్‌(Paris olympics) రెజ్లింగ్‌(wretling) ఫైనల్‌కు చేరిన వినేశ్‌ ఫోగట్‌(Vinesh phogat) స్వర్ణ పతకంతో స్వదేశానికి వస్తుందని సమస్త భారతీయులు ఆశపడ్డారు. అయితే ఫైనల్‌ మా్యచ్కు ముందు ఆమె బరువును(Weight) చూసిన ఒలింపిక్‌ నిర్వాహకులు వంద గ్రాములు ఎక్కువగా ఉందని గుర్తించారు. దీంతో ఆమెపై అనర్హత వేటు వేస్తూ ఒలింపిక్‌ కమిటీ, రెజ్లింగ్‌ కమిటీ నిర్ణయం తీసుకున్నాయి.

దయచేసి వినేశ్‌ ప్రైవసీకి భంగం కలగకుండా ప్రవర్తించాలని భారత ఒలింపిక్‌ సంఘం విజ్ఞప్తి చేసింది. మరోవైపు వినేశ్‌ ఫోగట్‌ విషయంలో అంతర్జాతీయ ఒలింపిక్‌ కమిటీ తీసుకున్న నిర్ణయంపై సవాల్‌ చేసేందుకు ఐవోఏ సమాయత్తమవుతోంది. ఒలింపిక్‌ అసోసియేషన్‌ నిబంధనల ప్రకారం.. పోటీ జరిగే రోజున బరువుతోపాటు వైద్య పరీక్షలను నిర్వహిస్తారు. అయితే, మంగళవారం రాత్రి సెమీ ఫైనల్ లో తలపడిన వినేశ్‌ బుధవారం ఉదయానికే బరువు పెరగడంపైనా భారత ఒలింపిక్‌ సంఘం అనుమానాలను వ్యక్తం చేస్తోంది. నంబర్ వన్ రెజ్లర్‌ సుసాకిపై విజయం సాధించి ఫైనల్‌కు చేరిన వినేశ్‌ ఫోగట్‌పై అనర్హత వేటు వేయడం దిగ్భ్రాంతిని కలిగించింది. ఈ నిర్ణయాన్ని సమీక్షించాలని ఐవోఏ డిమాండ్‌ చేసింది. ఒకవేళ నిర్ణయంపై ఒలింపిక్‌ కమిటీ పునఃసమీక్ష లేకపోతే మాత్రం వినేశ్‌ ఫోగట్‌పై అనర్హత వేటు కొనసాగుతుంది. ఫైనల్‌ పోరుకు ముందు రెజ్లర్‌పై వేటు పడటంతో మరో ఫైనలిస్ట్‌కు స్వర్ణం లభిస్తుంది. అయితే, రజత పతకాన్ని మాత్రం ఎవరికీ కేటాయించకుండా అలాగే వదిలేస్తారు. సెమీస్‌లో ఓడిన ఇద్దరు రెజర్లు కాంస్యం కోసమే పోటీపడాల్సి ఉంటుంది.

Updated On
Eha Tv

Eha Tv

Next Story