ఇరాక్‌లో(Iraq) మహిళల హక్కులు(Women rights) రోజురోజుకూ హరించుకుపోతున్నాయి.

ఇరాక్‌లో(Iraq) మహిళల హక్కులు(Women rights) రోజురోజుకూ హరించుకుపోతున్నాయి. ఇప్పుడు ఇరాక్‌ ప్రభుత్వం వివాహ చట్టాలను(Marriage act) సవరించేందుకు రెడీ అయ్యింది. బాలికల వివాహ వయసును(Women marriage ) తొమ్మిదేళ్లకు తగ్గిస్తూ ప్రభుత్వం చట్టాల్ని సవరించబోతున్నది. అంతేగాక మహిళలు విడాకులు(Divorce) పొందే హక్కు, పిల్లల సంరక్షణ, వారసత్వ హక్కులను కూడా హరించే అంశాలు ప్రతిపాదిత బిల్లులో ఉన్నాయని మీడియా చెబుతోంది. వివాహ చట్టాలను సవరించే ప్రయత్నంపై మానవ హక్కుల కార్యకర్తలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మహిళల హక్కులను కాలరాచి, పాలకులు పూర్తిగా మతానికి ప్రాధాన్యం ఇస్తున్నారని మానవ హక్కుల కార్యకర్తలు మండిపడుతున్నారు. కొత్త చట్టంతో బాలికలపై లైంగిక, శారీరక హింస పెరుగుతుందని హ్యుమన్‌ రైట్స్‌ వాచ్‌ అంటోంది. అలాగే మహిళలు విద్య, ఉపాధి హక్కును కోల్పోతారని పేర్కొంది. ఇరాకీ మహిళలు ఎంతగా వ్యతిరేకిస్తున్నా, ప్రభుత్వం మాత్రం చట్టాన్ని సవరించి తీరతామని అంటోంది.

Updated On
Eha Tv

Eha Tv

Next Story