ప్రస్తుతం గాజా(Gaza)లో భయానక వాతావరణం నెలకొంది. కళకళలాడే ఆ నగరం ఇప్పుడు రుద్రభూమిగా మారింది. ఎక్కడ చూసినా భీతావహదృశ్యాలే కనిపిస్తున్నాయి. ఎటుచూసినా శిథిలాలే! వాటి కింద చిక్కుకున్న మృతదేహాలు, క్షతగాత్రుల ఆక్రందనలు. నగరాన్ని కమ్ముకున్న దుమ్ము ధూళి. తినడానికి తిండి లేదు. తాగడానికి నీరు లేదు.

ప్రస్తుతం గాజా(Gaza)లో భయానక వాతావరణం నెలకొంది. కళకళలాడే ఆ నగరం ఇప్పుడు రుద్రభూమిగా మారింది. ఎక్కడ చూసినా భీతావహదృశ్యాలే కనిపిస్తున్నాయి. ఎటుచూసినా శిథిలాలే! వాటి కింద చిక్కుకున్న మృతదేహాలు, క్షతగాత్రుల ఆక్రందనలు. నగరాన్ని కమ్ముకున్న దుమ్ము ధూళి. తినడానికి తిండి లేదు. తాగడానికి నీరు లేదు. రాత్రి అయితే చిమ్మ చీకటి. ఎటువైపు నుంచి మృత్యువు తరుముకొస్తుందో తెలియదు. రాత్రి గడిస్తే చాలనుకునేవారు ఎందరో! రాకెట్ల చప్పుళ్లు యముని మహిషపు లోహఘంటల్లా వినిపిస్తున్నాయి. ప్రజలలో ఓ రకమైన భయాందోళన. కడుపు నింపుకోవడానికి దుకాణాల ముందు బారులు తీరిన జనం కనిపిస్తున్నారు. అక్కడ కూడా తిండి గింజలు దొరకడం లేదు. ఎందుకంటే నిత్యావసరాలు ఎప్పుడో అయిపోయాయి. ఐక్యరాజ్యసమితి శిబిరాలలో లక్షలాది మంది తలదాచుకుంటున్నారు. మరోవైపు ఇజ్రాయెల్‌-హమాస్‌ యుద్ధం(Israel-Gaza War) రోజురోజుకూ తీవ్రమవుతోంది. ఇజ్రాయెల్‌ సైన్యం దూకుడుగా వ్యవహరిస్తోంది. గాజాపై శక్తవంతమైన రాకెట్లను ప్రయోగించింది. గాజా నుంచి కూడా రాకెట్లు విరుచుకుపడ్డాయి. హమాస్‌ మిలిటెంట్ల(Hamas militant)నే టార్గెట్‌గా పెట్టుకున్న ఇజ్రాయెల్‌ సైన్యం గాజాపై నిరంతరం వైమానిక దాడులు చేస్తున్నది. ఇప్పుడు భూతల యుద్ధానికి కూడా రెడీ అయ్యింది. గాజాలో ప్రతీ ఇంటిని తనిఖీ చేస్తున్నారు సైనికులు. మిలిటెంట్లు అన్న అనుమానం వస్తే అక్కడే ఖతం చేస్తున్నారు. తమ దేశ భద్రతకు సవాలు విసురుతున్న మిలిటెంట్లను కూకటివేళ్లతో పీకిపారేయడమే లక్ష్యగా పెట్టుకున్నారు. ఇప్పటికే యూదులు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లారు. భూతల దాడులంటే మొదలైతే మాత్రం మరణాల సంఖ్య భారీగా పెరగుగుతుంది. అమాయకులు బలవుతారు. ఇదే అంతర్జాతీయ స్వచ్ఛంద సంస్థలకు ఆందోళన కలిగిస్తున్నది. ఇదిలా ఉంటే ఇజ్రాయెల్‌ సైన్యం సిరియా(Syria)లోని రెండు విమానాశ్రయాలపై వైమానిక దాడులు చేసింది. రాజధాని డమాస్కస్‌(Damascus)తోపాటు అలెప్పీలోని ఎయిర్‌పోర్టులపై దాడులకు దిగింది.సిరియాలో కూడా యుద్ధఛాయలు కనిపిస్తున్నాయి. హమాస్‌కు సిరియా సపోర్ట్‌ ఇవ్వడాన్ని ఇజ్రాయెల్‌ సహించలేకపోతున్నది. పైగా సిరియా భూభాగం నుంచి కూడా ఇజ్రాయెల్‌పై రాకెట్‌ దాడులు జరుగుతున్నాయి. హమాస్‌ చేతిలో బందీలుగా ఉన్న తమ సైనికులను, పౌరులను విడుదల చేయనంత వరకు గాజాకు ఆహారం, నీరు, ఇంధనం, విద్యత్‌ సరఫరాను ఇచ్చే ప్రసక్తే లేదని ఇజ్రాయెల్‌ స్పష్టం చేసింది.

Updated On 13 Oct 2023 12:09 AM GMT
Ehatv

Ehatv

Next Story