ఇజ్రాయెల్‌పై(Israel) హమాస్‌(Hamas) మిలిటెంట్లు అనూహ్యంగా దాడికి దిగిన తర్వాత పరిస్థితులు ఒక్కసారిగా యుద్ధంవైపుకు తీసుకువెళ్లాయి. ప్రస్తుతం ఇజ్రాయెల్‌లో భీకర యుద్ధం సాగుతోంది. ఇజ్రాయెల్‌ సైన్యం, హమాస్‌ మిలిటెంట్ల కదనరంగంలోకి దిగడంతో నెత్తుటేర్లు పారుతున్నాయి. మూడు రోజులుగా భయంకర యుద్ధం నడుస్తోంది.

ఇజ్రాయెల్‌పై(Israel) హమాస్‌(Hamas) మిలిటెంట్లు అనూహ్యంగా దాడికి దిగిన తర్వాత పరిస్థితులు ఒక్కసారిగా యుద్ధంవైపుకు తీసుకువెళ్లాయి. ప్రస్తుతం ఇజ్రాయెల్‌లో భీకర యుద్ధం సాగుతోంది. ఇజ్రాయెల్‌ సైన్యం, హమాస్‌ మిలిటెంట్ల కదనరంగంలోకి దిగడంతో నెత్తుటేర్లు పారుతున్నాయి. మూడు రోజులుగా భయంకర యుద్ధం నడుస్తోంది. హమాస్‌ చేసిన దాడికి ప్రతీకారంగా ఇజ్రాయెల్‌ సైన్యం గాజాపై వైమానిక దాడులు ఉధృతం చేసింది. హమాస్‌ మిలిటెంట్ల చొరబాట్లను అడ్డుకోవడానికి సరిహద్దుల్లో యుద్ధ ట్యాంకులు, డ్రోన్లను మోహరించింది. ఇజ్రాయెల్‌ దాడులలో గాజాలో వందలాది భవనాలు నేలకూలాయి. హమాస్‌ మిలిటెంట్లు ఇజ్రాయెల్‌ జవాన్లపై కాల్పులకు దిగుతున్నారు, రాకెట్లను కూడా ప్రయోగిస్తున్నారు.

ఫలితంగా దక్షిణ ఇజ్రాయెల్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. హమాస్‌ను ఇజ్రాయెల్ సైన్యం తీవ్రంగా ప్రతిఘటిస్తోంది. ఎప్పటిలాగే ఇజ్రాయెల్‌ ప్రజలు(Israel Citizens) యుద్ధరంగంలోకి దిగుతున్నారు. ఇజ్రాయెల్‌ ప్రభుత్వం కూడా ప్రజలకు పిలుపునిచ్చింది. మూడు లక్షల మంది ప్రజలను కదనానికి సన్నద్ధం చేస్తోంది. ఇజ్రాయెల్‌కు చెందిన ఓ జర్నలిస్టు(Journalist) హనన్యా నఫ్తాలీ(Hananya Naftali ) కూడా యుద్ధానికి సన్నద్ధమవుతున్నాడు. తాను హమాస్‌కు(Hamas) వ్యతిరేకంగా పోరాడేందుకు తన భార్యను వదిలి వెళుతున్నట్టు ప్రకటించాడు. కదనరంగానికి వెళుతున్న నఫ్తాలీ తన భార్యను హత్తుకున్న ఫోటోను ట్విట్టర్‌లో షేర్‌ చేశాడు.

తను లేకపోవడంలో తన సోషల్‌ మీడియా ఖాతాను తన భార్యే నిర్వహిస్తుందని ట్విట్టర్‌లో తెలిపాడు. తన దేశాన్ని రక్షించుకునేందుకు, సేవ చేసేందుకు వెళ్తున్నానని అన్నాడు. 'నా భార్య ఇండియా నఫ్తాలీకు గుడ్‌బై చెప్పేశాను. ఆమె నన్ను ఆశీర్వదించింది. భగవంతుడి రక్షణ నాకు అండగా ఉంటుందని చెప్పింది. ఇక నుంచి నా తరపున నా సోషల్ మీడియా ఖాతాను ఆమె నిర్వహిస్తుంది’ అంటూ భావోద్వేగ సందేశాన్ని షేర్‌ చేసుకున్నాడు. ఇదే సమయంలో ఇది మంచికి, చెడుకు మధ్య జరుగుతున్న యుద్ధం అని పేర్కొన్నారు. అటు పిమ్మట నఫ్తాలీ మరో వీడియోను సోషల్‌ మీడియాలో షేర్‌ చేశాడు. తాను యుద్ధానికి వెళ్తున్నది తమ సరిహద్దులను కాపాడుకోవడం కోసం మాత్రమే కాదని, తమ ఇళ్లను, కుటుంబాలను కాపాడుకోవడానికని అందులో తెలిపాడు. ఈ వీడియోపై నెటిజన్లు బాగా స్పందించారు. నఫ్తాలీపై ప్రశంసలు కురిపిస్తున్నారు. నిజమైన దేశభక్తి ఇదీ అని అంటున్నారు.

Updated On 10 Oct 2023 2:17 AM GMT
Ehatv

Ehatv

Next Story