ఎంతైనా బంగారం(Gold) బంగారమే! ఇంట్లో బంగారం ఉంటే అదో భరోసా. అందుకే పసిడి ధర తగ్గడం అంటూ ఉండదు. ఎప్పుడో ఓసారి బంగారం ధర కొంచెం తగ్గిందేమో అంతే! ఇప్పుడైతే ఎవరికీ అందకుండా కనకం ధర పరుగులుపెడుతోంది. సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. ఈ ఏడాది ఆరంభం నుంచి చూస్తే ఇప్పటికే మూడు నెలలలో సుమారు 20 శాతం బంగారం ధర పెరిగింది.

ఎంతైనా బంగారం(Gold) బంగారమే! ఇంట్లో బంగారం ఉంటే అదో భరోసా. అందుకే పసిడి ధర తగ్గడం అంటూ ఉండదు. ఎప్పుడో ఓసారి బంగారం ధర కొంచెం తగ్గిందేమో అంతే! ఇప్పుడైతే ఎవరికీ అందకుండా కనకం ధర పరుగులుపెడుతోంది. సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. ఈ ఏడాది ఆరంభం నుంచి చూస్తే ఇప్పటికే మూడు నెలలలో సుమారు 20 శాతం బంగారం ధర పెరిగింది. ఇప్పుడు 10 గ్రాముల బంగారం ధర 74,500 రూపాయలు దాటింది. మనకు బంగారం అంటే మోజు. ఎంతో కొంత బంగారం ఉండాలనే మనస్తత్వం మనది. ఇంతగా ధర పెరుగుతుంటే బంగారం కొనగలమా అన్న సందేహం చాలా మందికి వచ్చేసింది. నిజంగానే బంగారం ధర ఆ స్థాయిలో పెరుగుతుందా? అసలు ఇప్పుడెందుకు బంగారం రేటు రన్నింగ్‌ రేసు చేస్తోంది? లాస్టియర్‌ ఏప్రిల్‌ నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి నాటికి రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(Reserve Bank Of India) 13 టన్నుల బంగారాన్ని కొనుగోలు చేసింది. దీంతో ఆర్‌బీఐ(RBI) నిర్వహణలోని బంగారం నిల్వలు 817 టన్నులకు చేరుకున్నాయి. బంగారం నిల్వలు ఎంత ఉంటే అంత మంచింది. పైగా రిస్క్‌ లేని వ్యవహారం. అందుకే ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆర్‌బీఐ ఆరు టన్నుల బంగారం నిల్వలు పెంచుకుంది. జనవరిలో 8.7 టన్నుల బంగారాన్ని కొన్నది. 2022 జూలై తర్వాత ఒక నెలలో ఇవే గరిష్ట కొనుగోళ్లు. ప్రపంచంలోని సెంట్రల్‌ బ్యాంకు(Central Banks)లు అన్ని కలిసి ఫిబ్రవరి 19 టన్నుల బంగారాన్ని కొన్నాయి. చైనా(Chaina) అత్యధికంగా 12 టన్నులు కొన్నది. జనవరిలో టర్కీ 11.8 టన్నులు, చైనా పది టన్నులు, కజకిస్థాన్‌ 6.2 టన్నుల చొప్పున బంగారాన్ని కొనుగోలు చేశాయి.

ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరిలో సెంట్రల్‌ బ్యాంక్‌లు 64 టన్నుల బంగారం కొన్నాయి. ఇక ముందు కూడా సెంట్రల్‌ బ్యాంక్‌ల నుంచి డిమాండ్‌ కొనసాగవచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మన దగ్గరే కాదు, అంతర్జాతీయంగా కూడా బంగారం ధరలు పెరుగుతున్నాయి. ఔన్సు బంగారం అంటే 31.10 గ్రాముల బంగారం ధర 2, 400 డాలర్లకు చేరింది. మన కరెన్సీలో చెప్పాలంటే తులం బంగారం 64,370 రూపాయలు ఉందన్నమాట! కాకపోతే ఇంతకంటే ఎక్కువ మన మార్కెట్లు ట్రేడ్‌ అవుతోంది. బంగారాన్ని దిగుమతి చేసుకుంటాం కాబట్టి డాలర్లలో చెల్లించాల్సి ఉంటుంది. డాలర్‌తో రూపాయి మారకం విలువ దిగుమతి ధరలను నిర్ణయిస్తుందన్న విషయాన్ని మర్చిపోకూడదు. రూపాయి విలువ క్షీణిస్తున్న కొద్దీ, అంతర్జాతీయ మార్కెట్‌తో పోలిస్తే దేశీయ మార్కెట్లో బంగారం ధర మధ్య అంతరం పెరుగుతూ వెళుతుంది. దీనికి తోడు బంగారం దిగుమతులపై కేంద్ర సర్కారు కస్టమ్స్‌ సుంకాన్ని కూడా వసూలు చేస్తుంటుంది. బంగారం, వెండిపై ప్రస్తుతం ఈ సుంకం 15 శాతంగా ఉంది. ఇవన్నీ కలిసి దేశీయ మార్కెట్లో బంగారం ధర అధికంగా ఉండేలా చేస్తున్నాయి. ప్రస్తుతం బంగారం, వెండి ధరలు విపరీతంగా పెరగడం వెనుక చాలా కారణాలు ఉన్నాయి. ప్రస్తుతం అంతర్జాతీయంగా అమెరికా సహా అన్ని ప్రముఖ దేశాల్లోనూ వడ్డీ రేట్లు గరిష్ట స్థాయిల్లో చెల్లిస్తున్నాయి. ఇక్కడి నుంచి తగ్గడమే కానీ, పెరగడానికి అవకాశాల్లేవు. సమీప కాలంలోనే వడ్డీ రేట్ల తగ్గింపు మొదలవుతుందన్న అంచనాలు ఉన్నాయి. ముఖ్యంగా అమెరికా ఫెడ్‌ జూన్‌ నుంచే రేట్ల కోతను మొదలు పెడుతుందని అంచనాలు ఏర్పడ్డాయి. సెంట్రల్‌ బ్యాంకులు స్థిరంగా బంగారాన్ని కొనుగోలు చేస్తూ వస్తున్నాయి. ఈ ఏడాది ప్రముఖ దేశాల్లో ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయో చెప్పడం కష్టమవుతోంది. ఇలాంటి తరుణంలో పెట్టుబడులకు బంగారాన్ని మించింది లేదనుకుంటున్నారు. ఇజ్రాయెల్‌(Israel) తన దాడులను లెబనాన్‌(Lebanon)లోని హిజ్బుల్లా(Hezbollah) స్థావరాలపైకి విస్తరించింది. ఇది కూడా బంగారం ధరల పెరుగుదలకు కారణమని విశ్లేషకులు అంటున్నారు. బంగారం పెరగడానికి భౌఓళిక రాజకీయ ఉద్రికత్తలకు తోడు డాలర్‌ విలువ స్థిరత్వం విషయంలో సెంట్రల్‌ బ్యాంకులలో నమ్మకం సడలమేనని అంటున్నారు. మనం ఇప్పటికీ అధిక శాతం మంది బంగారాన్ని విలువైన, పొదుపు సాధనంగా చూస్తున్నాం. బంగారం విలువ ఎప్పటికీ పెరిగేదే కానీ, తరిగేది కాదని, కష్టాల్లో ఆదుకుంటుందన్నది మన నమ్మకం. అందుకే బంగారం ధర రాకెట్ స్పీడ్‌ కంటే వేగంగా పరుగులు తీస్తోంది.

Updated On 15 April 2024 12:32 AM GMT
Ehatv

Ehatv

Next Story