ఇజ్రాయెల్‌(Israel), పాలస్తీనా మిలిటెంట్‌ గ్రూప్‌ హమాస్‌(Hamas) మధ్య జరుగుతున్న భీకర యుద్ధంలో అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. ఇప్పటికే మూడున్నర వేల మంది చనిపోయారు. గాజాలో(Gaza) పరిస్థితి భయానకంగా మారింది. ప్రజలు కట్టుబట్టలతో సురక్షిత ప్రాంతాలకు తరలివెళుతున్నారు. పైగా ఉత్తర గాజాను ఖాళీ చేయాలంటూ ఇజ్రాయెల్ సైనం ఆదేశాలు పాలస్తీనియున్లను తీవ్ర ఆందోళనకు నెట్టేశాయి.

ఇజ్రాయెల్‌(Israel), పాలస్తీనా మిలిటెంట్‌ గ్రూప్‌ హమాస్‌(Hamas) మధ్య జరుగుతున్న భీకర యుద్ధంలో అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. ఇప్పటికే మూడున్నర వేల మంది చనిపోయారు. గాజాలో(Gaza) పరిస్థితి భయానకంగా మారింది. ప్రజలు కట్టుబట్టలతో సురక్షిత ప్రాంతాలకు తరలివెళుతున్నారు. పైగా ఉత్తర గాజాను ఖాళీ చేయాలంటూ ఇజ్రాయెల్ సైనం ఆదేశాలు పాలస్తీనియున్లను తీవ్ర ఆందోళనకు నెట్టేశాయి. ఇప్పటకే గాజాలో కరెంట్‌ సరఫరా నిలిచిపోయింది. తినడానికి తిండి లేక, తాగేందుకు నీరు లేక జనం అల్లాడిపోతున్నారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని కాలి నడకన దక్షిణ గాజాకు వెళుతున్నారు. హమాస్‌ మిలిటెంట్లను నిర్మూలించడమే లక్ష్యంగా పెట్టుకున్న ఇజ్రాయెల్‌ సైన్యం పూర్తిస్థాయి యుద్ధానికి సన్నద్ధమవుతోంది.

గాజాను ఆక్రమించుకోవడానికి సరిహద్దులో 3.60 లక్షల మంది రిజర్వ్‌ సైనికులను సిద్ధం చేసింది. వారం రోజులుగా గాజాలోని హమాస్‌ స్థావరాలపై వైమానిక దాడులు చేస్తున్న ఇజ్రాయెల్‌ సైన్యం తాజాగా భూతల దాడులను మొదలు పెట్టిందని ఇజ్రాయెల్‌ ప్రధానమంత్రి బెంజామిన్‌ నెతన్యాహు అన్నారు. తమ దేశం ఇప్పుడే ప్రతీకారం తీర్చుకోవడం మొదలు పెట్టిందని తెలిపారు.జనవాస ప్రాంతాలలో మకాం వేసిన హమాస్‌ మిలిటెంట్లు అక్కడి నుంచే తమ కార్యకలాపాలు సాగిస్తున్నారు. ప్రజలను కవచంగా ఆడుకుంటూ ఇజ్రాయెల్‌పై రాకెట్లు ప్రయోగిస్తున్నారు.

ప్రజలను అక్కడి నుంచి తరలిస్తే హమాస్‌ మిలిటెంట్లను సులభంగా ఏరిపారేయవచ్చన్నది ఇజ్రాయెల్‌ భావన. గాజాలో మొత్తం 20 లక్షల మంది ఉంటున్నారు. ఇప్పుడు ఉత్తర గాజా నుంచి పది లక్షల మంది దక్షిణ గాజాకు వెళితే ఆ ఒత్తిడిని ఆ నగరం తట్టుకోలేదు. మరోవైపు ఉత్తర గాజాను ఖాళీ చేయాలంటూ ఇజ్రాయెల్‌ సైన్యం ఇచ్చిన ఆదేశాలపై ఐక్య రాజ్య సమితి ఆందోళన వ్యక్తం చేసింది. లక్షలాది మందిని బలవంతంగా తరలించడం మానవ విపత్తు అవుతుందని పేర్కొంది. జనాన్ని ఖాళీ చేయించే ఆలోచన మానుకోవాలని ఇజ్రాయెల్‌కు ఐక్యరాజ్యసమితి ప్రతినిధి స్టెఫానీ డుజారిక్‌(Stephanie Dujarric) సూచించారు.

Updated On 14 Oct 2023 5:53 AM GMT
Ehatv

Ehatv

Next Story