26 మంది ప్రాణాలను బలిగొన్న పహల్గామ్ ఉగ్రవాద దాడికి ప్రతీకారంగా, భారత సాయుధ దళాలు బుధవారం తెల్లవారుజామున ఆపరేషన్ సిందూర్ నిర్వహించి పాకిస్తాన్

26 మంది ప్రాణాలను బలిగొన్న పహల్గామ్ ఉగ్రవాద దాడికి ప్రతీకారంగా, భారత సాయుధ దళాలు బుధవారం తెల్లవారుజామున ఆపరేషన్ సిందూర్ నిర్వహించి పాకిస్తాన్, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్‌లోని తొమ్మిది ఉగ్రవాద స్థావరాలను లక్ష్యంగా చేసుకున్నాయి, వీటిలో జైష్-ఎ-మొహమ్మద్(Jaish-e-Mohammed) ఉంటన్న బహవల్పూర్(Bahawalpur), లష్కరే-ఎ-తోయిబా స్థావరం మురిద్కే ఉన్నాయి. బహవల్పూర్‌లో జరిగిన వైమానిక దాడుల్లో జైష్-ఎ-మొహమ్మద్ చీఫ్ మసూద్ అజార్ కుటుంబ సభ్యులు పది మంది మరణించారు, అతని సోదరి కూడా ఉన్నారు. "నా కుటుంబంలోని 10 మంది సభ్యులు ఈ అదృష్టాన్ని ఈ రాత్రి కలిసి పొందారు. ఐదుగురు అమాయక పిల్లలు జన్నతుల్ ఫిర్దౌస్ చనిపోయారు. నా అక్క సాహిబా, నా ప్రాణం కంటే ప్రియమైనది, ఆమె భర్త...నా మేనల్లుడు అలీమ్ ఫాజిల్, అతని భార్య, నా ప్రియమైన మేనకోడలు ఆలం ఫాజిలా...మా మేనల్లుడు, అతని భార్య " చనిపోయారని మసూద్‌ అజార్‌ ప్రకటించాడు. "మోదీ అమాయక పిల్లలను, మహిళలను, వృద్ధులను లక్ష్యంగా చేసుకున్నారు. ఈ దుఃఖం భరించలేనిది. కానీ ఎటువంటి విచారం, నిరాశ, భయం లేదు... ఈ 14 మందిలో నేను కూడా ఉండాల్సిందని నాకు పదే పదే గుర్తుకు వస్తుంది, కానీ అల్లాను కలిసే సమయం చాలా ఉంది. మా ఇంట్లో 7 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాల మధ్య వయస్సు గల మొత్తం నలుగురు పిల్లలు ఉన్నారు. ఆ నలుగురూ కలిసి స్వర్గానికి వెళ్లారు'' అని మసూద్‌ అన్నారు.

ehatv

ehatv

Next Story