కిరణ్‌రావు(Kiran Rao) దర్శకత్వంలో వచ్చిన లాపతా లేడీస్‌(Laapataa Ladies) ఎంతటి ఘన విజయం సాధించిందో

కిరణ్‌రావు(Kiran Rao) దర్శకత్వంలో వచ్చిన లాపతా లేడీస్‌(Laapataa Ladies) ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. హీరో అమీర్‌ఖాన్‌(Aamir Khan) భార్యే కిరణ్‌ రావు. థియేటర్లలో పెద్దగా ఆడకపోయినప్పటికీ ఓటీటీ(OTT)లో స్ట్రీమింగ్‌ అయిన తర్వాత ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. చిన్న సినిమాగా విడుదలయ్యి పెద్ద విజయాన్ని సాధించింది. ఇప్పుడీ సినిమా మరో అరుదైన ఘనత సాధించింది. 2025 ఆస్కార్‌(Oscar)కోసం మన దేశం నుంచి లాపతా లేడీస్‌ అధికారికంగా ఎంపికయ్యింది. ఈ విషయాన్ని ఫిల్మ్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా ప్రకటించింది. ఈ సినిమాలో స్పర్ష్‌శ్రీ వాత్సవ(Sparsh Shrivastava),నితాన్షి గోయల్‌(Nitanshi Goel),ప్రతిభ ప్రధాన పాత్రలు పోషించారు.

Updated On
ehatv

ehatv

Next Story