ఇండోనేషియాలోని కెపులావాన్ బటు వ‌రుస భూప్ర‌కంప‌న‌లు సంభ‌వించాయి. ఆదివారం ఉదయమే రెండు సార్లు భూమి కంపించిన‌ట్లు నివేదిక‌లు పేర్కొన్నాయి.

ఇండోనేషియా(Indonesia)లోని కెపులావాన్ బటు(Kepulauan Batu) వ‌రుస భూప్ర‌కంప‌న‌(Earth Quake)లు సంభ‌వించాయి. ఆదివారం ఉదయమే రెండు సార్లు భూమి కంపించిన‌ట్లు నివేదిక‌లు పేర్కొన్నాయి. యూరోపియన్ మెడిటరేనియన్ సీస్మోలాజికల్ సెంటర్ (EMSC) ప్రకారం.. దాదాపు 6 తీవ్రతతో ఈ రెండు భూప్ర‌కంప‌న‌లు సంభవించిన‌ట్లు తెలుస్తోంది. మొదటి భూకంపం 6.1 తీవ్రతతో ఆదివారం తెల్ల‌వారుజామున సంభ‌వించ‌గా.. భూకంప కేంద్రం 43 కిమీ (26.72 మైళ్లు) లోతులో నిక్షిప్త‌మై ఉంది. కొన్ని గంటల తర్వాత 5.8 తీవ్రతతో మ‌రో భూకంపం సంభవించ‌గా.. భూకంప కేంద్రం 40 కిమీ (24.85 మైళ్లు) లోతులో ఉంద‌ని యూరోపియన్ మెడిటరేనియన్ సీస్మోలాజికల్ సెంటర్(European Mediterranean Seismological Centre) వెల్ల‌డించింది. భూకంప ఘ‌ట‌న‌పై పూర్తి స‌మాచారం తెలియాల్సివుంది.

Updated On 22 April 2023 11:54 PM GMT
Yagnik

Yagnik

Next Story