పది వేల పుస్తకాలను చదివామని చెప్పుకున్నవాళ్లను చూశాం కానీ... పది వేల మంది మహిళలతో శృంగారంలో పాల్గొన్నానని చెప్పుకునే వారి గురించి ఎప్పుడైనా విన్నారా? వినకపోతే ఆ మగపుంగవుడి గురించి చెబుతాను.. ఫ్రాన్స్‌కు చెందిన మాజీ ఫుట్‌బాలర్‌ బెంజమిన్‌ మెండీనే ఆ శృంగార పురుషుడు. తాను పది వేల మంది మహిళలతో సెక్స్‌లో పాల్గొన్నట్టు గర్వంగా ప్రకటించుకున్నాడు.

పది వేల పుస్తకాలను చదివామని చెప్పుకున్నవాళ్లను చూశాం కానీ.. పది వేల మంది మహిళలతో శృంగారంలో పాల్గొన్నానని చెప్పుకునే వారి గురించి ఎప్పుడైనా విన్నారా? వినకపోతే ఆ మగపుంగవుడి గురించి చెబుతాను.. ఫ్రాన్స్‌కు చెందిన మాజీ ఫుట్‌బాలర్‌ బెంజమిన్‌ మెండీనే ఆ శృంగార పురుషుడు. తాను పది వేల మంది మహిళలతో సెక్స్‌లో పాల్గొన్నట్టు గర్వంగా ప్రకటించుకున్నాడు. రెండేళ్ల కిందట ఇతగాడు ఓ మహిళపై అత్యాచారం చేశాడు. అప్పుడామెతో తాను పది వేల మంది మహిళలతో శృంగారంలో పాల్గొన్నానని అని చెప్పాడట. ఆ బాధితురాలే ఈ విషయాన్ని కోర్టుకు తెలిపింది. ఆమె చెప్పిన మాటలను కోర్టు రికార్డు చేసింది. ప్రస్తుతం మాంచెస్టర్‌ సిటీ ఫుట్‌బాల్‌ క్లబ్‌తో కాంట్రాక్ట్‌ కుదుర్చుకున్న బెంజమిన్‌ తరచూ బంధుమిత్రులకు గ్రాండ్‌గా పార్టీలు ఇస్తుంటాడు. ఇతడి ఆహ్వానితులలో మగవాళ్లతో పాటు ఆడవాళ్లు కూడా ఉంటారు. రెండుసార్లు మహిళలతో అసభ్యంగా ప్రవర్తించిన చరిత్ర కూడా ఇతడికి ఉంది. మొద‌టిసారి బెంజ‌మిన్ ఒక మ‌హిళ‌ను త‌నతో శృగారంలో పాల్గొనాల్సిందిగా బ‌ల‌వంతం చేశాడు. రెండోసారి అత‌డు 24ఏళ్ల మ‌హిళ‌పై అత్యాచారం చేశాడు’ అని ప్రాసిక్యూట‌ర్ బెంజ‌మిన్ ఐన(Benjamin Aina KC) కోర్టుకు వివరించారు. అత్యాచారానికి గురైన మహిళ తన ఫ్రెండ్స్‌తో కలిసి ఓ బార్‌ బయట ఉన్నప్పుడు బెంజమిన్‌ చూశాడు. ఆమెను తన ఇంటికి ఆహ్వానించి, అత్యాచారానికి పాల్పడ్డాడు. అంతేనా 2018లోనూ అతడు ఒక మహిళను రేప్‌ చేసేందుకు ప్రయత్నించాడు..అయితే బెంజమిన్‌ మెండీ మాత్రం తనపై వస్తున్న ఆరోపణలను కొట్టేస్తున్నాడు. తాను ఎలాంటి తప్పు చేయలేదని అన్నాడు. సదరు మహిళల అంగీకారం మేరకే తాను శృంగారంలో పాల్గొన్నాను తప్ప, అత్యాచారాలు చేయలేదని వివరించాడు.

2017 నుంచి 2019 వ‌ర‌కు ఫ్రాన్స్ జాతీయ జ‌ట్టుకు ప్రాతినిధ్యం వహించిన బెంజమిన్‌ మెండీ 2018లో వ‌ర‌ల్డ్ క‌ప్ గెలిచిన జ‌ట్టులో అత‌ను స‌భ్యుడు. చిత్రమేమిటంటే ఇతగాడి వయసు 28 ఏళ్లే! ఇక మీరే ఊహించుకోండి.. పది వేల అమ్మాయిలతో శృంగారంలో పాల్గొనడం సాధ్యమయ్యే పనేనా?

Updated On 30 Jun 2023 6:55 AM GMT
Ehatv

Ehatv

Next Story