శతమానంభవతి అంటూ పెద్దలు ఆశీర్వదిస్తారు కానీ వయసులో సెంచరీలు కొట్టడం అత్యంత అరుదు! మొన్నామధ్యన సుదీర్ఘకాలం జీవించి ఉన్న ఓ అయిదుగురు వృద్ధులను చూశాం. వారిలో కొందరు ప్రపంచ రికార్డు(World Record)ను కూడా సాధించారు. వారి వయసును చూసే బిత్తరపోయాం. వారందరికటే ఘనుడు మరొకడున్నాడు.

శతమానంభవతి అంటూ పెద్దలు ఆశీర్వదిస్తారు కానీ వయసులో సెంచరీలు కొట్టడం అత్యంత అరుదు! మొన్నామధ్యన సుదీర్ఘకాలం జీవించి ఉన్న ఓ అయిదుగురు వృద్ధులను చూశాం. వారిలో కొందరు ప్రపంచ రికార్డు(World Record)ను కూడా సాధించారు. వారి వయసును చూసే బిత్తరపోయాం. వారందరికటే ఘనుడు మరొకడున్నాడు. సుదీర్ఘకాలంగా జీవిస్తూ ఉన్న ఓ వ్యక్తిని చూస్తే ఆశ్చర్యమేస్తుంది. అసలు ఇన్నేళ్లపాటు ఎలా బతికాడా అని అనుకుంటాం! ఆ వృద్దుడి పేరు మార్సెలినో అబాద్‌(Marcelino Abad). ఉండేది హువానుకోలోని సెంగ్రల్‌ పెరువియన్‌. ఆయన వయసు 124 ఏళ్లని అక్కడి ప్రభుత్వం చెబుతోంది. సుదీర్ఘకాలంగా జీవించిన వ్యక్తి ఈయనేనని పేర్కొంది. ఇన్నేళ్లపాటు జీవించి ఉండటానికి ఆయన జీవనశైలే కారణమని అంటున్నారు. ప్రశాంత మనసుతో పది మంది సాయం చేస్తూ ఉంటారట! అందరితో స్నేహ్నంగా ఉంటారట! మొన్న ఏప్రిల్‌ 5వ తేదీన తన 124 పుట్టిన రోజును ఘనంగా జరుపుకున్నారు మార్సెలినో అబాద్‌. ఈయనే అత్యంత వృద్ధ వ్యక్తి అని గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డు(Guinness World Record)కు లేఖ రాశారు పెరువియన్‌ అధికారులు. సంబంధించిన అధికారిక పత్రాలను కూడా సమర్పించారు. గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్స్‌ తాము పంపిన దరఖాస్తులను తప్పనిసరిగా స్వీకరిస్తుందని అంటున్నారు అధికారులు. పండ్లను ఎక్కువగా భుజించే మార్సెలినో అబాద్‌కు గొర్రె మాంసం అంటే మహా ఇష్టమట!
పెరువియన్‌ సంప్రదాయం ప్రకారం తినే కోకా ఆకులను ప్రతిరోజు నమలడం అలవాటు చేసుకున్నానని, సుదీర్ఘకాలం ఆరోగ్యంగా జీవించడానికి అది కూడా ఒక కారణం కావొచ్చని అబాద్‌ అంటున్నారు.

Updated On 10 April 2024 4:23 AM GMT
Ehatv

Ehatv

Next Story