అగ్రరాజ్యం అమెరికా(America)లో మరోసారి కాల్పుల కలకలం రేగింది. ఉటా రాష్ట్రంలోని సెంటెనియల్‌ పార్క్‌ లో జరిగిన ఈ ఘటనలో ఎనిమిది నెలల చిన్నారి సహా ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు.

అగ్రరాజ్యం అమెరికా(America)లో మరోసారి కాల్పుల కలకలం రేగింది. ఉటా రాష్ట్రంలోని సెంటెనియల్‌ పార్క్‌ లో జరిగిన ఈ ఘటనలో ఎనిమిది నెలల చిన్నారి సహా ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. పలువురు గాయపడ్డారు. ఉటా రాష్ట్రంలోని వెస్ట్ వ్యాలీ సిటీ(West Valley City)లో జరిగిన వెస్ట్‌ఫెస్ట్ కార్నివాల్‌(West Fest Carnival)లో ఆదివారం రాత్రి 9:20 గంటల సమయంలో కాల్పుల ఘటన చోటుచేసుకుంది. వెస్ట్ వ్యాలీ సిటీ పోలీస్ డిపార్ట్‌మెంట్ ప్రకారం, సెంటెన్నియల్ పార్క్‌లో జరిగిన ఈ ఘటనలో రెండు గ్రూపుల మధ్య మాటామాటా గొడవ జరుగుతుండగా, 16 ఏళ్ల బాలుడు తుపాకీతో కాల్పులు జరిపాడు. ఈ దాడిలో 41 ఏళ్ల మహిళ, 18 ఏళ్ల యువకుడు, 8 నెలల శిశువు మృతి చెందారు. వీరిలో మహిళ, శిశువు గొడవకు సంబంధం లేదు. మరో ఇద్దరు టీనేజర్లు 17 ఏళ్ల బాలిక, 15 ఏళ్ల బాలుడు చేతికి గాయాలతో బయటపడ్డారు. ఒక గర్భిణీ కూడా తప్పించుకునే ప్రయత్నంలో గాయపడింది. పోలీసులు 16 ఏళ్ల అనుమానితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఒక పోలీసు అధికారి కాల్పులకు ప్రతిగా కాల్పులు జరిపినప్పటికీ, అనుమానితుడిని గాయపరచలేదు. ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది, సాక్షుల నుండి సమాచారం సేకరిస్తున్నారు. ఈ దుర్ఘటన వెస్ట్‌ఫెస్ట్‌లో దిగ్భ్రాంతికి గురిచేసింది.

Updated On
ehatv

ehatv

Next Story