మెక్సికో (Mexico)తరపున పోటీ చేసిన ఫాతిమా బాష్ మిస్ యూనివర్స్ 2025 కిరీటాన్ని గెలుచుకున్నారు.

మెక్సికో (Mexico)తరపున పోటీ చేసిన ఫాతిమా బాష్ మిస్ యూనివర్స్ 2025 కిరీటాన్ని గెలుచుకున్నారు. థాయ్‌లాండ్‌కు చెందిన ప్రవీణార్ సింగ్ మొదటి రన్నరప్‌గా నిలిచారు. 74వ మిస్ యూనివర్స్ పోటీ థాయ్‌లాండ్‌ (Thailand)లోని బ్యాంకాక్ సమీపంలో ఉన్న నోంతబురిలోని ఇంపాక్ట్ ఛాలెంజర్ హాల్‌లో జరిగింది. భారతదేశం నుండి పాల్గొన్న మానిక విశ్వకర్మ(Manika Vishwakarma) టాప్ 30లో నిలిచారు. ఈ పోటీలో అనేక వివాదాలు (Controversies) చోటుచేసుకున్నాయి. ముఖ్యంగా, నిర్ణేతలు రాజీనామా (Judges resign) చేయడం మరియు మిస్ మెక్సికో, ఫాతిమా బాష్, ఒక ఆర్గనైజర్‌తో బహిరంగ వాగ్వాదం తర్వాత ప్రీ-పేజెంట్ ఈవెంట్ నుండి వాకౌట్ చేయడం వంటి సంఘటనలు జరిగాయి. 2026లో జరగబోయే 75వ మిస్ యూనివర్స్ పోటీకి ఆతిథ్య దేశంగా పోర్టో రికోను (Puerto Rico) ప్రకటించారు

Updated On
ehatv

ehatv

Next Story