Latest News : చెట్లకు ఏమన్నా డబ్బులు కాస్తున్నాయా.. డబ్బులేమో కానీ బంగారం కాస్తుంది..!
మన ఇంట్లో పిల్లలో లేదా ఎవరైనా కుటుంబసభ్యులు, బంధవులు అలవికాని కోరికల చిట్టా విప్పితే ‘డబ్బు ఏమైనా చెట్లకు స్తుందనుకుంటున్నారా?

మన ఇంట్లో పిల్లలో లేదా ఎవరైనా కుటుంబసభ్యులు, బంధవులు అలవికాని కోరికల చిట్టా విప్పితే ‘డబ్బు ఏమైనా చెట్లకు స్తుందనుకుంటున్నారా? ఇది సహజంగా వచ్చే మాట. లేదంటే ఏదైనా బ్యాంకుకు కన్నం వేద్దాం అని సరదగా అంటుంటాం. కానీ చెట్లకు డబ్బులు కాయకపోవచ్చు కానీ బంగారం కాస్తుందని అనేది ఇప్పుడు వాస్తవికంగా మారుతోంది. తళతళలాడే కరెన్సీ నోట్ల రూపంలో కాదు గానీ ధగధగ మెరిసే అచ్చమైన బంగారం రూపంలో! బంగారం కాసే ఆ చెట్టు పేరు ‘నార్వే స్ర్పూస్’!
'నార్వే స్ప్రూస్' అనే చెట్టు ఫిన్‌లాండ్ అడవుల్లో ముఖ్యంగా ఉత్తర లాప్‌లాండ్ ప్రాంతంలో బంగారు రేణువులు, ఆకుల్లో ఉత్పత్తి చేస్తున్నాయని ఇటీవల పరిశోధనలో తేలింది. ఇది కేవలం ఒక అద్భుతమైన శాస్త్రీయ కనుగుణం, కానీ దాన్ని ఆధారంగా చేసుకుని బంగారు గనులు కనుగొనడానికి ఉపయోగపడుతుంది. ఫిన్‌లాండ్‌లోని కిట్టిలా గోల్డ్ మైన్ యూరప్‌లో అతిపెద్ద బంగారు గని సమీపంలోని టిరా గోల్డ్ డిపాజిట్ ప్రాంతంలో భూమిలో బంగారు గనులు ఉన్నాయి. ఇది ఫిన్‌లాండ్ అడవుల్లో సాధారణంగా పెరిగే ఒక రకమైన సన్నని చెట్టు. దీని ఆకులలో ఈ బంగారు కణాలు కనుగొన్నారు. ఇవి నానోసైజ్ అంటే ఒక మిల్లీమీటర్ వంతు పొడవు కణాలు. ఇవి చూడాలంటే ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ అవసరం. ఒక చెట్టులో 0.2 నుంచి 2.8 మైక్రోగ్రాముల వరకు మాత్రమే ఉంటాయి. భూమిలోని బంగారు గనులు, సూక్ష్మజీవుల సహాయంతో ద్రావక రూపంలో నీటితో కలిసి వేర్ల ద్వారా చెట్టు శిఖరాలకు చేరుకుంటాయి. చెట్ల వేర్లు ఈ ద్రావక బంగారాన్ని గ్రహిస్తాయి. 23 చెట్లలో 138 ఆకులు సేకరించి పరిశోధించగా, 4 చెట్లలో (17%) ఈ బంగారు కణాలు కనుగొన్నారు.
