నాలుగోసారి పాక్‌ ప్రధాని పదవి చేపట్టాలని నవాజ్‌ షరీఫ్ (Nawaz Sharif) భావిస్తున్నారు. ఈ క్రమంలో తమ పార్టీ నుంచి టికెట్ల ఆశిస్తున్నవారితో ఆయన సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నవాజ్‌ షరీఫ్ కీలక వ్యాఖ్యలు చేశారు. మన విధానాలే దేశంలో ఆర్థిక సంక్షోభానికి కారణమవుతున్నాయని చెప్పారు. సైన్యం వల్లే దేశం దివాళా తీసిందని ఆరోపించారు.

తన ప్రభుత్వాన్ని సైన్యం (Militory) కూల్చడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని అన్నారు. పాకిస్తాన్‌ ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుపోవడానికి భారత్‌ (India), అమెరికా (America), ఆఫ్గనిస్తాన్‌ (Afghanistan) కారణం కాదని ఆయన అన్నారు. 1993, 1999, 2017లో తమ ప్రభుత్వాన్ని సైన్యం కూల్చివేసిందన్నారు. నాలుగోసారి పాక్‌ ప్రధాని కావాలని షరీఫ్ అనుకుంటున్నారు. ఈ మేరకు ముస్లిం లీగ్‌ నవాజ్‌ పార్టీ (Muslim League Nawaz Party) టికెట్ల ఆశావహులతో సమావేశం నిర్ణయించారు. ఈ సారి ఎన్నికల్లో ప్రజలు తమకే పట్టం కట్టనున్నారని అన్నారు. 2018లో ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగిందని.. అందుకే దేశ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని.. పాకిస్తాన్‌ ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిందని ఆయన అన్నారు.

Updated On 20 Dec 2023 1:42 AM GMT
Ehatv

Ehatv

Next Story