నోబెల్ శాంతి బహుమతి అనేది ప్రపంచంలోని అత్యంత ప్రతిష్టాత్మక అవార్డులలో ఒకటి

నోబెల్ శాంతి బహుమతి అనేది ప్రపంచంలోని అత్యంత ప్రతిష్టాత్మక అవార్డులలో ఒకటి, దీనిని ఆల్ఫ్రెడ్ నోబెల్ స్మారక ఆర్థిక శాస్త్ర బహుమతితో సహా ఇతర నోబెల్ బహుమతులతో పాటు, నోబెల్ ఫౌండేషన్ ద్వారా అందజేస్తారు. ఈ బహుమతిని శాంతి కోసం పనిచేసిన వ్యక్తులు లేదా సంస్థలకు అందజేస్తారు. డైనమైట్ ఆవిష్కర్త ఆల్ఫ్రెడ్ నోబెల్ జ్ఞాపకార్థం ఇచ్చే ఆరు అవార్డులలో ఒకటి నోబెల్ శాంతి బహుమతి. ప్రతి సంవత్సరం శాంతి, సాహిత్యం, భౌతికశాస్త్రం, రసాయన శాస్త్రం, ఆర్థికశాస్త్రం, ఔషధరంగం అనే ఆరు రంగాలలో ఎవరైతే వారి చర్యల ద్వారా మానవజాతికి ఉత్తమ ప్రయోజనాన్ని కలిగిస్తారో వారికి ఈ సంస్థ అవార్డులను ప్రదానం చేస్తుంది. ఇతర నోబెల్ బహుమతులు స్వీడన్ లో ఇవ్వబడుతుండగా, నోబెల్ శాంతి బహుమతి నార్వేలో ఇవ్వబడుతుంది. ఎందుకంటే ఈ బహుమతులు ప్రారంభించినప్పుడు నార్వే, స్వీడన్ ఒక దేశంగా ఉన్నాయి

నోబెల్ శాంతి బహుమతి కోసం నామినేషన్లు నిర్దిష్ట అర్హత కలిగిన వ్యక్తులు లేదా సంస్థల నుండి మాత్రమే స్వీకరించబడతాయి. ప్రతి సంవత్సరం సెప్టెంబర్–ఫిబ్రవరి మధ్య నామినేషన్లు స్వీకరిస్తారు. పార్లమెంట్ సభ్యులు, ప్రభుత్వ మంత్రులు, అంతర్జాతీయ న్యాయస్థానాల సభ్యులు, యూనివర్సిటీ ప్రొఫెసర్లు, శాంతి పరిశోధనా సంస్థల డైరెక్టర్లు దరఖాస్తు చేయొచ్చు. నామినేషన్లు గోప్యంగా ఉంచబడతాయి. 50 సంవత్సరాల వరకు బహిర్గతం కావు.

నోబెల్ శాంతి బహుమతిని నార్వేజియన్ నోబెల్ కమిటీ ఎంపిక చేస్తుంది. ఈ కమిటీలో నార్వే పార్లమెంట్ చేత నియమించబడిన ఐదుగురు సభ్యులు ఉంటారు. నామినేషన్లు స్వీకరించిన తర్వాత, కమిటీ వాటిని విశ్లేషిస్తుంది, అర్హత ఉన్న అభ్యర్థుల జాబితాను సిద్ధం చేస్తుంది. సమీక్షలో, అభ్యర్థుల శాంతి కోసం చేసిన కృషి, వారి ప్రభావం, ఆల్ఫ్రెడ్ నోబెల్ లక్ష్యాలకు అనుగుణంగా ఉన్నాయా అని పరిశీలిస్తారు.

ప్రతి సంవత్సరం అక్టోబర్‌లో విజేతలను ప్రకటిస్తారు. అవార్డు వేడుక డిసెంబర్ 10న ఆల్ఫ్రెడ్ నోబెల్ వర్ధంతి సందర్భంగా ఓస్లో (నార్వే)లో జరుగుతుంది. విజేతకు ఒక మెడల్, డిప్లొమా, నగదు బహుమతి (2023లో దాదాపు 10 మిలియన్ స్వీడిష్ క్రోనర్, అంటే సుమారు $1 మిలియన్) అందజేయబడుతుంది.

నోబెల్ శాంతి బహుమతి ఇవ్వడానికి ఆల్ఫ్రెడ్ నోబెల్ యొక్క వీలునామా ఆధారంగా కొన్ని నియమాలు, నిబంధనలు పాటించబడతాయి. బహుమతి వ్యక్తులకు లేదా సంస్థలకు ఇవ్వబడుతుంది. దేశాల మధ్య శాంతి కోసం చేసిన ప్రయత్నాలు, యుద్ధ నిర్మూలన లేదా తగ్గింపు కోసం కృషి చేసిన ప్రయత్నాలను విశ్లేషిస్తారు. శాంతి సమావేశాలు లేదా శాంతి ఒప్పందాలను చేసిన కృషి.. మానవ హక్కుల పరిరక్షణ, లేదా సంఘర్షణల నివారణ కోసం చేసిన పనులు పరిగణనలోకి తీసుకోబడతాయి.

ఒక సంవత్సరంలో గరిష్టంగా ముగ్గురు వ్యక్తులు లేదా సంస్థలు బహుమతిని పంచుకోవచ్చు. ఒక వ్యక్తి లేదా సంస్థ ఒకటి కంటే ఎక్కువసార్లు బహుమతిని గెలుచుకోవచ్చు ఇంటర్నేషనల్ కమిటీ ఆఫ్ ది రెడ్ క్రాస్ మూడుసార్లు గెలిచింది

నామినేషన్లు మరియు ఎంపిక ప్రక్రియ పూర్తిగా గోప్యంగా ఉంటుంది. నామినేషన్ సమాచారం 50 సంవత్సరాల తర్వాత మాత్రమే బహిర్గతం చేయబడుతుంది. మరణానంతరం నోబెల్ బహుమతి ఇవ్వబడదు, కానీ నామినేషన్ సమయంలో జీవించి ఉండి, అవార్డు ప్రకటన సమయానికి మరణించిన వ్యక్తికి ఇవ్వవచ్చు. నోబెల్ శాంతి బహుమతి 1901లో మొదలైంది, కొన్ని సంవత్సరాలలో ముఖ్యంగా యుద్ధ సమయాలలో ఎవరికీ ఇవ్వలేదు.

గత గ్రహీతలలో మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్, మదర్ థెరిసా, నెల్సన్ మండేలా, యునైటెడ్ నేషన్స్ వంటి వారు ఉన్నారు. 2023లో, ఈ బహుమతిని ఇరానియన్ మానవ హక్కుల కార్యకర్త నర్గెస్ మొహమ్మదీ గెలుచుకుంది, ఆమె మహిళల హక్కుల కోసం చేసిన కృషికి గుర్తింపుగా ఇచ్చారు. మహాత్మా గాంధీ: 5 సార్లు నామినేట్ అయ్యారు, కానీ బహుమతి ఇవ్వలేదు. 1948లో నోబెల్‌ శాంతి బహుమతి కోసం మహాత్మా గాంధీని ఎంపిక చేశారు. అయితే ఆయన ఆ సంవత్సరం జనవరి 30వ తేదీన గాడ్సే చేతిలో చనిపోయారు. అప్పట్లో ఉన్న నియమం ప్రకారం కొన్ని ప్రత్యేక పరిస్థితులలోనే మరణించిన వ్యక్తులకు నోబెల్‌ బహుమతులు ప్రకటించాలనేది నిబంధన. గాంధీ ఒక సంస్థకు ప్రతినిధి కాదు. మరణ విల్లును ఆయన రాయలేదు. బహుమతి ఎవరికి అందజేయాలో నోబెల్‌ సంస్థకు తెలియకపోవడంతో ప్రతిపాదన విరమించుకున్నారు.

ప్రతిష్ఠాత్మక నోబెల్‌ శాంతి బహుమతి 2025 మరియా కొరీనా మచాడోకు దక్కింది. ఈ విషయాన్ని నార్వే నోబెల్‌ కమిటీ ప్రకటించింది. వెనెజులాకు చెందిన మరియా కొరీనా ప్రజాస్వామ్య హక్కుల కోసం పోరాడినందుకు గానూ ఈ పురస్కారం లభించింది. అయితే, ఈ అత్యున్నత పురస్కారం కోసం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అనేక ప్రయత్నాలు చేసినప్పటికీ ఫలితం దక్కలేదు

నోబెల్ శాంతి బహుమతి పొందిన భారతీయులు / భారత సంబంధిత వ్యక్తులు

1. రవీంద్రనాథ్ ఠాగూర్– 1913. బహుమతి విభాగం: సాహిత్యం. గీతాంజలి కవితా సంకలనం ద్వారా భారత సాంస్కృతిక విలువలను ప్రపంచానికి పరిచయం చేశారు. శాంతి బహుమతి కాకపోయినా, భారత వ్యక్తికి నోబెల్ చరిత్రలో మొదటిది కావడం విశేషం.

2. మదర్ థెరిసా– 1979. బహుమతి విభాగం: శాంతి జన్మస్థలం: స్కోప్జే (ప్రస్తుత నార్త్ మేసిడోనియా), కానీ జీవితమంతా భారతదేశంలో సేవలందించారు.

3. దలైలామా (14వ దలైలామా – టెంజిన్ గ్యాత్సో) – 1989. తిబెట్ ఆధ్యాత్మిక నాయకుడు, కానీ భారతదేశంలో ఆశ్రయం పొందారు (1959లో). తిబెట్ ప్రజల కోసం హింసాత్మక మార్గం కాకుండా శాంతి మార్గాన్ని అవలంబించడం. భారతదేశం నుంచి శాంతి, అహింస సిద్ధాంతాలను ప్రపంచానికి పరిచయం చేశారు.

4. కైలాష్ సత్యార్థి – 2014. బాల కార్మికత్వం, బాల దాస్యానికి వ్యతిరేకంగా చేసిన పోరాటం. పిల్లల విద్యా హక్కుల కోసం ప్రపంచవ్యాప్తంగా ఉద్యమం నడిపారు. ఈ బహుమతిని మలాలా యూసఫ్‌జాయ్ (పాకిస్తాన్) తో పంచుకున్నారు.

Updated On
ehatv

ehatv

Next Story