NRI Priyanka Tiwari : భర్తపై కోపంతో కన్న కొడుకును పొట్టన పెట్టుకుంది..!
అమెరికాలో(America) అమానవీయ ఘటన చోటు చేసుకుంది. నార్త్ కరోలినాలో(North Corolina) ఎన్‌ఆర్‌ఐ ప్రియాంక తివారి(NRI Priyanka Tiwari) (33), భర్త, కుమారుడితో కలిసి ఉంటోంది. భార్యాభర్తల మధ్య తరుచుగా గొడవలు జరుగుతుండేవి.

NRI Priyanka Tiwari
అమెరికాలో(America) అమానవీయ ఘటన చోటు చేసుకుంది. నార్త్ కరోలినాలో(North Corolina) ఎన్‌ఆర్‌ఐ ప్రియాంక తివారి(NRI Priyanka Tiwari) (33), భర్త, కుమారుడితో కలిసి ఉంటోంది. భార్యాభర్తల మధ్య తరుచుగా గొడవలు జరుగుతుండేవి. ప్రియాంకతో గొడవపెట్టుకుని ఇంటినుంచి భర్త వెళ్లిపోయాడు. ఎవరు ఫోన్ చేసినా ప్రియాంక స్పందించేదికాదు. తన పదేళ్ల కొడుకు అపస్మారకస్థితిలోకి వెళ్లిపోయాడని పోలీసులకు ప్రియాంకనే సమాచారం ఇచ్చింది. దీంతో ప్రియాంక ఇంటికి చేరుకున్న పోలీసులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. కుల్లిపోయిన స్థితిలో బాలుడి మృతదేహం పోలీసుల కంటపడింది. భర్తపై కోపంతోనే కన్న కొడుకుకు ఆహారం పెట్టకుండా బాలుడి మృతికి కారణమైందని పోలీసులు వెల్లడించారు. ప్రియాంకను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ప్రియాంకపై మర్డర్ కేసు నమోదు చేశారు. తన కొడుకు మృతికి ప్రియాంకే కారణమని తెలిస్తే ఉరిశిక్ష లేదా పెరోల్ లేని జీవితఖైదు పడే అవకాశముందని పోలీసులు తెలిపారు.
