భారత్‌తో సహా ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు S-400 గురించి చర్చ జరుగుతోంది.

భారత్‌తో సహా ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు S-400 గురించి చర్చ జరుగుతోంది. ఎందుకంటే పాక్‌ మిసైళ్లను, డ్రోన్లను ఎస్‌-400 యుద్ధ విమానంతో తిప్పికొడుతోంది. ఇది లాంగ్ రేంజ్ యాంటీ-ఎయిర్‌క్రాఫ్ట్(Anti Aircroft), యాంటీ-మిస్సైల్ డిఫెన్స్ సిస్టమ్(Anti Missile Defence System). 400 కి.మీ. వరకు ఫైటర్ జెట్స్, బాంబర్స్, డ్రోన్స్, క్రూయిజ్ మిసైళ్లు, బాలిస్టిక్ మిసైళ్లు వంటి వాటిని ఎదుర్కునే సత్తా దీనికి ఉంటుంది. ఒకే సిస్టమ్‌తో వివిధ రకాల టార్గెట్స్‌ను ఎదుర్కొనే సామర్థ్యం దీనికి ఉంటుంది. స్టెల్త్ ఎయిర్‌క్రాఫ్ట్‌లను కూడా గుర్తించగల రాడార్ సిస్టమ్ ఇందులో ఉంది. భారతదేశం (India)2018లో రష్యా(Russia)తో $5.43 బిలియన్ ఒప్పందం కుదుర్చుకుని ఐదు S-400 యూనిట్లను కొనుగోలు చేసింది. మొదటి యూనిట్ 2021లో డెలివరీ అయింది, 2024 నాటికి మూడు యూనిట్లు డెలివరీ అయ్యాయి, మిగతావి 2025-26 నాటికి వస్తాయని అంచనా వేస్తున్నారు. వీటిని కలిపి "మల్టీ-లేయర్డ్ రాడార్ నెట్‌వర్క్" అంటారు. 600 కి.మీ. వరకు టార్గెట్‌లను గుర్తించడమే కాకుండా ఒకేసారి 100+ టార్గెట్‌లను ట్రాక్ చేయగల సామర్థ్యం. 360 డిగ్రీల రేడియస్‌లో ప్రత్యర్థుల నుంచి వచ్చే డ్రోన్లు, ఫైటర్‌జెట్స్, క్రూయిజ్‌ మిసైళ్లు, బాలిస్టిక్ మిసైళ్లను ఇది గుర్తిస్తుంది. ఈ ఎస్-400 క్షిపణి వ్యవస్థ ఒకేసారి 300 లక్ష్యాలను ట్రాక్ చేస్తుంది. అదే సమయంలో ఒకేసారి 36 ముప్పులను కూడా ఎదుర్కొంటుంది. ఈ క్షిపణులు గంటకు 17 వేల కిలోమీటర్ల వేగంతో, 10 మీటర్ల నుంచి 30 కిలోమీటర్ల ఎత్తు వరకు.. అంతరిక్షం అంచున ఉన్న బాలిస్టిక్ క్షిపణులతో సహా ఇతర లక్ష్యాలను చేధించగలవు.

ehatv

ehatv

Next Story