ఒసామా బిన్ లాడెన్(Osamabin laden) చనిపోయినట్లు భావిస్తున్న ఒసామా బిన్ లాడెన్ కుమారుడు అమ్జా బిన్ లాడెన్(Hamzabin laden) సజీవంగా ఉన్నాడని సమాచారం.

ఒసామా బిన్ లాడెన్(Osamabin laden) చనిపోయినట్లు భావిస్తున్న ఒసామా బిన్ లాడెన్ కుమారుడు అమ్జా బిన్ లాడెన్(Hamzabin laden) సజీవంగా ఉన్నాడని సమాచారం. ఆఫ్ఘనిస్తాన్(Afganistan) ఉగ్రవాద సంస్థ అల్ ఖైదాకు నాయకత్వం వహిస్తున్నాడు. హమ్జా ఇప్పుడు తాలిబాన్(taliban), స్థానిక ఉగ్రవాద సంస్థలతో కలిసి భయానక ప్రణాళికలను రూపొందించినట్లు వార్తలు వస్తున్నాయి. ఇంటెలిజెన్స్ వర్గాల(Inteligence report) సమచారం ప్రకారం హమ్జా బిన్ లాడెన్ సజీవంగా మాత్రమే కాకుండా అల్-ఖైదా పునరుజ్జీవనంలో చురుకుగా పాల్గొన్నాడు, ఈ వాస్తవం సీనియర్ తాలిబాన్ నాయకులలో బాగా తెలుసు. ఈ నాయకులు... ఆయనతో క్రమం తప్పకుండా సమావేశాలు నిర్వహిస్తూ, ఆయనకు, ఆయన కుటుంబానికి భద్రత కల్పిస్తున్నారు. ఇది అల్-ఖైదా, తాలిబాన్‌ల మధ్య లోతైన సంబంధాన్ని తెలుపుతోంది. అల్-ఖైదాకు నాయకత్వం వహించే స్థాయికి హమ్జా ఎదిగాడని తెలిపారు. ఇరాక్ యుద్ధం తర్వాత దాని అత్యంత శక్తివంతంగా తయారుచేశాడని నివేదిక ఇచ్చారు. హమ్జా సోదరుడు అబ్దుల్లా బిన్ లాడెన్ కూడా అల్-ఖైదా కార్యకలాపాలలో పాలుపంచుకున్నట్లు భావిస్తున్నారు. తండ్రిలా తమ వ్యతిరేక దేశాలను వణికించాలని భావిస్తున్నారట. పాశ్చాత్య దేశాలపై భవిష్యత్తులో దాడులకు తెగబడే అవకాశం ఉన్నట్లు ఇంటెలిజెన్స్ నివేదిక తెలుపుతోంది. అంతేకాకుండా హమ్జా సోదరుడు అబ్దుల్లా బిన్ లాడెన్ కీలక పాత్ర పోషిస్తున్నాడు.2019లో అప్పటి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆగ్నేయ ఆఫ్ఘనిస్తాన్‌లోని ఘజనీ ప్రావిన్స్‌లో జరిగిన వైమానిక దాడిలో హమ్జాపై దాడికి ఆదేశించారు. కానీ హమ్జా, అతని నలుగురు భార్యలు చాలా సంవత్సరాలు ఇరాన్‌లో ఆశ్రయం పొందారని భావిస్తున్నారు. హమ్జా అబ్దుల్లా ఖేల్ జిల్లాలో ఉంటున్నారని.. అక్కడ 450 మంది అరబ్బులు, పాకిస్థానీలు అతనికి రక్షణ కల్పిస్తున్నారని నివేదిక వెల్లడించింది.

Updated On
Eha Tv

Eha Tv

Next Story