కల్కి2898 ఏడీ(Kalki 2898 AD) సినిమా సూపర్‌ సక్సెస్‌ సాధించడంతో పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌(Prabhas) ఫుల్‌ జోష్‌లో ఉన్నాడు.

కల్కి2898 ఏడీ(Kalki 2898 AD) సినిమా సూపర్‌ సక్సెస్‌ సాధించడంతో పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌(Prabhas) ఫుల్‌ జోష్‌లో ఉన్నాడు. ప్రస్తుతం హను రాఘవపూడి(Hanu Raghavapudi) డైరెక్షన్‌లో ప్రభాస్‌ నటించబోతున్నాడు. ఫౌజీ(Fauji) అనే వర్కింగ్‌ టైటిల్తో రాబోతున్న ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో మైత్రీ మూవీ మేకర్స్‌(Mytri movie makers) నిర్మిస్తోంది. అక్టోబర్‌లో సెట్స్‌ మీదకు వెళ్లనున్న ఈ సినిమా ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ పనులు జరుపుకుంటున్నది. సందీప్ రెడ్డి వంగా ప్ర‌భాస్ కాంబినేషన్‌లో వ‌స్తున్న చిత్రం స్పిరిట్ ప్రీ ప్రోడ‌క్ష‌న్ ప‌నులు ఆల‌స్యం అవుతుండ‌డంతో ఆ స్థానంలో ఫౌజీ సెట్స్‌పైకి వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో హీరోయిన్‌ ఎవరనేదానిపై ఓ ఆసక్తికరమైన వార్త సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. పాకిస్తాన్‌ హీరోయిన్‌ సజల్‌ అలీని(Heroine Sajal ali) చిత్ర యూనిట్‌ సంప్రదిస్తున్నారని ఫిలింనగర్‌లో టాక్‌! సజల్ అలీ ఇంత‌కుముందు శ్రీదేవితో కలిసి మామ్ అనే సినిమాలో న‌టించింది. ఆ త‌ర్వాత మ‌ళ్లీ బాలీవుడ్‌లో చేయ‌లేదు. ఫౌజీలో పాకిస్తాన్‌ హీరోయిన్‌ నటిస్తున్నదనగానే హను రాఘవపూడి మళ్లీ ఏమైనా లవ్‌ స్టోరీని తెరకెక్కిస్తున్నారా అన్న అనుమానం కలుగుతోంది. ఈ సినిమా స్వాతంత్య్రానికి పూర్వం జరిగే కథతో రాబోతున్న‌దట! అవిభాజ్య భారత్‌లో పాకిస్థాన్ క‌లిసి ఉండేది. ఈ నేప‌థ్యంలో హ‌ను రాఘ‌వ‌పూడి క‌థ రాసుకున్నారట! ఈ సినిమాకు విశాల్‌ చంద్రశేఖర్‌ సంగీతాన్ని అందిస్తున్నాడు.

Updated On
Eha Tv

Eha Tv

Next Story