యునైటెడ్‌ స్టేట్స్‌ ఆఫ్‌ కైలాస(United States of Kailash) దేశపు అధినేత నిత్యానంద స్వామి(Nithyananda Swamy) మళ్లీ వార్తల్లోకి వచ్చేశారు. పాపం ఈయన కారణంగా పరాగ్వే(Paraguay) దేశపు వ్యవసాయ మంత్రి తన పదవికి రాజీనామా(Resign) చేయాల్సి వచ్చింది. నిత్యానంద స్వామి ఈయనొక్కరినే కాదు, దక్షిణ అమెరికాలోని పలువురు ప్రభుత్వాధికారులను కూడా తప్పుదోవపట్టించారు.

యునైటెడ్‌ స్టేట్స్‌ ఆఫ్‌ కైలాస(United States of Kailash) దేశపు అధినేత నిత్యానంద స్వామి(Nithyananda Swamy) మళ్లీ వార్తల్లోకి వచ్చేశారు. పాపం ఈయన కారణంగా పరాగ్వే(Paraguay) దేశపు వ్యవసాయ మంత్రి తన పదవికి రాజీనామా(Resign) చేయాల్సి వచ్చింది. నిత్యానంద స్వామి ఈయనొక్కరినే కాదు, దక్షిణ అమెరికాలోని పలువురు ప్రభుత్వాధికారులను కూడా తప్పుదోవపట్టించారు.అసలేం జరిగిందంటే ఈ ఏడాది ఆరంభంలో యునైటెడ్‌ స్టేట్స్‌ ఆఫ్‌ కైలాస ప్రతినిధులు జెనీవాలో(Jeniwa) నిర్వహించిన ఐక్యరాజ్య సమితి సమావేశాలలో పాల్గొన్నారు. ఆ సమావేశాలలో పరాగ్వే మంత్రి అర్నాల్డో(Arnaldo) చమర్రో కూడా పాల్గొన్నారు. పాల్గొనడమే కాదు కైలాస దౌత్య సంబంధాల ఏర్పాటుకు కృషి చేస్తానని, అంతర్జాతీయ వేదికలపై కైలాస దేశ సార్వభౌమత్వానికి గుర్తింపు లభించేలా మద్దతు ఇస్తామని ఓ ప్రకటనపై సంతకం కూడా చేశారు. దీనిపై పరాగ్వేలో అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఇది పెద్ద స్కామ్‌(Scam) అంటూ సోషల్‌ మీడియాలో(social Media) నెటిజన్లు తీవ్ర విమర్శలు చేశారు. దీంతో గత్యంతరం లేక పరాగ్వే వ్యవసాయ మంత్రి అర్నాల్డో తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. అమెరికా(america), కెనడాకు(Canada) చెందిన స్థానిక నాయకులతో కూడా కైలాస ప్రతినిధులు ఇదే తరహాలో పలు ఒప్పందాలు చేసుకున్నారు. మరి వీళ్ల పరిస్థితి ఏమిటో తెలయడం లేదు. 'యునైటెడ్‌ స్టేట్స్ ఆఫ్‌ కైలాస ఎక్కడుందో నాకు తెలియదు. మౌలిక సదుపాయాలు, నీటి పారుదలకు సంబంధించి పరాగ్వేకు సాయం చేస్తామని కైలాస ప్రతినిధులు ముందుకు రావడంతో నేను ప్రకటనా పత్రాలపై సంతకం చేశాను' అని అర్నాల్డో చమర్రో వాపోతున్నారు. మరోవైపు పరాగ్వేలోని స్థానిక మున్సిపాలిటిలతో చేసుకున్న ఒప్పందాలకు సంబంధించిన ప్రతులను కైలాస దేశపు సోషల్‌ మీడియా అకౌంట్లలో ఉంచడంతో దానిపై తీవ్ర దుమారం చెలరేగింది. గతంలో అమెరికాలోని న్యూజెర్సీ(New Jersy) రాష్ట్రంలోని నెవార్క్‌ నగర యంత్రాంగాన్ని కూడా కైలాస ప్రతినిధుల ఇదే తరహాలో మోసం చేశారు. ఈ మేరకు నెవార్క్‌ నగర యంత్రాంగం ఒక ప్రకటన విడుదల చేసింది. నిత్యానందపై ఇండియాలో అత్యాచారం కేసుతో పాటు పలు కేసులు ఉన్నాయి. తనకు ఎక్కడ శిక్ష పడుతుందోనన్న భయంతో 2019లో దేశం విడిచి పారిపోయారు నిత్యానంద. తర్వాత ఈక్వెడార్‌ సమీపంలోని ఓ ద్వీపంలో ఉన్నట్లు ఇంటర్‌ పోల్‌ వర్గాలు పసిగట్టాయి. ఆ ద్వీపానికే యునైటెడ్‌ స్టేట్స్‌ ఆఫ్‌ కైలాస అని పేరు పెట్టి తనని తాను దేశాధినేతగా ప్రకటించుకున్నారు. కైలాసకు సొంతంగా డాలర్‌, రిజర్వ్‌ బ్యాంకు, జెండా, పాస్‌పోర్టును తీసుకొచ్చారు. అనంతరం కైలాస ప్రతినిధిగా చెబుతూ.. విజయప్రియ నిత్యానంద అనే మహిళ ఈ ఏడాది ఫిబ్రవరిలో జెనీవాలో జరిగిన ఐరాస సమావేశానికి హాజరయ్యారు. ఈ సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. నిత్యానందను భారత్‌ వేధిస్తోందని ఆరోపించారు.

Updated On 1 Dec 2023 2:15 AM GMT
Ehatv

Ehatv

Next Story