Modi Selfi With Meloni : మెలోనితో మోదీ సెల్ఫీ .. సోషల్‌ మీడియాలో వైరల్‌

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(Narendra Modi) ఇటలీ పర్యటన ముగిసింది. జీ7 దేశాల సమావేశానికి(G7 summit) వెళ్లిన మోదీ స్వదేశానికి తిరిగి వ‌చ్చేశారు. మోదీతో ఇట‌లీ ప్ర‌ధానమంత్రి జార్జియా మెలోని(Italy PM Giorgia Meloni) సెల్ఫీ దిగారు. చేతిలో ఫోన్ పట్టుకున్న మెలోనీ.. మోదీతో ఫోటో దిగారు. సెల్ఫీ దిగుతూ ఇద్దరూ స్మైల్‌ ఇచ్చారు. ఆ సెల్ఫీ ఫోటో ప్ర‌స్తుతం సోషల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. గత ఏడాది దుబాయ్‌లో(dubai) కాప్‌ -28 సదస్సు జరిగిన సమయంలో కూడా వీరిద్దరూ సెల్ఫీ(Selfi) దిగారు. ఆ ఫోటో కూడా ఇప్పుడు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇదిలా ఉంటే జీ7 శిఖ‌రాగ స‌ద‌స్సు సంద‌ర్భంగా జార్జియా మెలోనీతో ద్వైపాక్షిక చ‌ర్చ‌ల్లో మోదీ పాల్గొన్నారు. మూడ‌వ సారి ప్ర‌ధాని బాధ్య‌త‌లు చేప‌ట్టిన మోదీ తొలిసారి విదేశీ టూర్‌కు వెళ్లారు. మెలోనీ ఆహ్వానం మేర‌కు ఆయ‌న ఇటలీ వెళ్లారు.

Updated On
Eha Tv

Eha Tv

Next Story