Prostitution in Davos: దావోస్‌లో వ్యభిచారం.. పారిశ్రామికవేత్తలను భారీగా ఆకర్షించిన శృంగార సదస్సులు..!
Prostitution in Davos: దావోస్‌లో వ్యభిచారం.. పారిశ్రామికవేత్తలను భారీగా ఆకర్షించిన శృంగార సదస్సులు..!

స్విట్టర్లాండ్‌లోని దావోస్ ఆర్థిక సదస్సులకు పేరొందింది. 1971 నుంచి ఇక్కడ ఆర్థిక సదస్సులు జరుగుతున్నాయి. తాజాగా ఈ నెలలో జరిగిన మీటింగ్ కు దాదాపు 130 దేశాల నుంచి ప్రజా ప్రతినిధులు, పారిశ్రామిక వేత్తలు వస్తారు. భవిష్యత్తు అవకాశాలు, పెట్టుబడులు, అభివృద్ధి జరిగే వివిధ రంగాలపై చర్చిస్తారు. మన దేశం నుంచి కూడా వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మంత్రులు, అధికారులు వెళ్తుంటారు. అయితే పెట్టుబడుల సంగతి పక్కన పెడితే ప్రముఖ పత్రిక డెయిలీ మెయిల్ ప్రకారం.. ఇక్కడ శృంగారం (వ్యభిచారం) విపరీతంగా పెరిగిపోయిందని కథనం రాసింది. ఇక్కడకు వచ్చిన పారిశ్రామిక వేత్తలపై సంచలన నివేదిక బయటపెట్టింది ఈ పత్రిక. సదస్సుకు హాజరైన పారిశ్రామిక వేత్తలు శృంగారం కోసం కోటాను కోట్లు ఖర్చు చేశారని ఆ పత్రిక పేర్కొంది. పగలు బిజినెస్ మీట్‌లు, రాత్రిపూట వ్యభిచార సదస్సులా..! అంటూ నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.
దావోస్‌లో వ్యభిచారమనేది అధికారికంగా నిర్వహిస్తారు. విటులను ఆకర్షించుకునేందుకు దావోస్‌లో చాలా ఏజెన్సీలు ఉంటాయి. విటుల శృంగార వాంచలను బట్టి ఈ ఏజెన్సీలు సర్వీసులు అందిస్తాయి. ఆన్ లైన్ లో కూడా బుక్ చేసుకోవచ్చు. వీటికి కంపెనీలు ఉంటాయి. ఎలాంటి వారు కావాలన్నా వీటి ద్వారా బుక్ చేసుకోవచ్చును. దావోస్‌కు వచ్చిన పారిశ్రామిక వేత్తలు పెద్ద ఎత్తున బుకింగ్ లు చేసుకున్నారని తెలుస్తోంది. వారికి చాలానే డబ్బులు కూడా ముట్టజెప్పారని డెయిలీ మెయిల్ కథనం రాసింది. ఒక్కో బుకింగ్ కూ 6000 పౌండ్లు కూడా చెల్లించినవారు ఉన్నారట. ఇలా మొత్తం ఈ ఏడాది జరిగిన సదస్సు మొదటి మూడు రోజుల్లోనే ఒక్క వెబ్ సైట్ నుంచే 2, 70, 000 పౌండ్లు అంటే మన కరెన్సీలో 2.9 కోట్లు బుక్ చేసుకున్నారని చెప్పింది. ఇలా మొత్తం బుకింగ్‌ల ఖర్చు దాదాపు 10 కోట్లకుపైనే ఉంటుందని డెయిలీ మెయిల్ తన నివేదికలో తెలిపింది. ఒకేసారి ఎక్కువ మంది అమ్మాయిలను కూడా బుక్ చేసుకునే అవకాశం ఉంటుంది. వీటినే ఆర్గీస్ పార్టీలు అని అంటారు. ఇలాంటి ఆర్గీస్ పార్టీలను ఏర్పాటు చేసే ఓ యాప్ ద్వారా దాదాపు 90 మంది పారిశ్రామిక వేత్తలు మూడు రోజుల్లో 300 ఎస్కార్ట్‌లను బుక్ చేసుకున్నారని, ఇందులో ట్రాన్స్‌జెండర్లు కూడా ఉన్నారని మెయిల్ పత్రిక కథనం. కానీ ఎవరి పేర్లు బయటకు రాకుండా యాప్‌లు, వెబ్‌సైట్లు చక్కగా మేనేజ్ చేశారని సమాచారం.


