Putin Fires at Trump Ahead of India Summit : చమురు కొనుగోళ్లలో ట్రంప్ వైఖరిపై పుతిన్ ఫైర్..!
ఇంధన కొనుగోళ్ల విషయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీరును రష్యా ప్రెసిడెంట్ పుతిన్ ఎండగట్టారు.

ఇంధన కొనుగోళ్ల విషయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీరును రష్యా ప్రెసిడెంట్ పుతిన్ ఎండగట్టారు. అమెరికా తమ అణు విద్యుత్ ప్లాంట్ల కోసం మా వద్ద యురేనియం కొనుగోలు చేస్తూనే ఉంది. మా నుంచి ఇంధనం కొనే హక్కు ఆ దేశానికి ఉన్నప్పుడు భారత్‌కు అలాంటి హక్కు లేకుండా ఎందుకు చేయాలి?’ అని ఇండియా ఇంటర్వ్యూలో ప్రశ్నించారు. ఇండియాతో ఇంధన భాగస్వామ్యం స్థిరంగా ఉందని, పాశ్చాత్య ఆంక్షలతో ప్రభావితం కాలేదని స్పష్టం చేశారు. రష్యన్ చమురు కొనుగోలు చేస్తున్న దేశాలపై ట్రంప్ ఒత్తిడి తెచ్చారు. ముఖ్యంగా భారత్‌పై 50% టారిఫ్ విధించారు. ఇది భారత్ రష్యా నుంచి చమురు కొనుగోలు చేయకుండా చేయాలని బెదిరించినట్లుగా పుతిన్ అభివర్ణించారు. ప్రధాని మోదీతో సమ్మిట్‌కు ముందు పుతిన్ ఇండియా టుడేకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్‌ను ఎండగట్టారు. "అమెరికా ఇప్పటికీ మా నుంచి న్యూక్లియర్ ఫ్యూయల్ కొనుగోలు చేస్తోంది తమ అణు విద్యుత్ కేంద్రాలకు. అది కూడా ఇంధనమే! అమెరికాకు మా ఇంధనం కొనే హక్కు ఉంటే, భారత్‌కు ఎందుకు లేదని ఎండగట్టారు.


