ప్రపంచంలో చాలా దేశాలలో పాముల(Snakes) సంచారం ఉంది. ఏటా లక్ష మందికి పైగా పాము కాటుతో కన్నుమూస్తున్నారు. మన దేశంలో అయితే పాములు లేని ఊర్లు ఉండవంటే అతిశయోక్తి కాదు. చిత్రమేమిటంటే అసలు పాము అనేదే లేని దేశాలు కూడా కొన్ని ఉన్నాయి. న్యూజిలాండ్‌(New zealand), ఐర్లాండ్‌(Ireland), గ్రీన్‌లాండ్‌(Greenland), అంటార్కిటికా వంటి దేశాలలో పాములు అసలు కనిపించనే కనిపించవట! అందుకు కారణం అవి అతి శీతల(Cool Places) ప్రదేశాలు కావడమే!

ప్రపంచంలో చాలా దేశాలలో పాముల(Snakes) సంచారం ఉంది. ఏటా లక్ష మందికి పైగా పాము కాటుతో కన్నుమూస్తున్నారు. మన దేశంలో అయితే పాములు లేని ఊర్లు ఉండవంటే అతిశయోక్తి కాదు. చిత్రమేమిటంటే అసలు పాము అనేదే లేని దేశాలు కూడా కొన్ని ఉన్నాయి. న్యూజిలాండ్‌(New zealand), ఐర్లాండ్‌(Ireland), గ్రీన్‌లాండ్‌(Greenland), అంటార్కిటికా వంటి దేశాలలో పాములు అసలు కనిపించనే కనిపించవట! అందుకు కారణం అవి అతి శీతల(Cool Places) ప్రదేశాలు కావడమే! బ్రిటన్‌లోని కొన్ని ప్రదేశాలలో, అమెరికాలోని అలస్కాలో కూడా పాములు కనిపించవు. గడ్డకట్టే చలిలో పాములు బతకలేవు. క్రీస్తు శకం ఆరంభంలో సెయింట్‌ పాట్రిక్(Saint Ptrick) అనే క్రైస్తవ మత పెద్ద ఐర్లాండ్‌ ద్వీపం నలుమూలలోని పాములను తరిమేసి సముద్రంలో పడేశారట! అలాగని ఆ దేశ పురాణాలు చెబుతున్నాయి. అందువల్లే అక్కడ పాములు ఉండవని కథలు కథలుగా చెబుతుంటారు. సుమారు పదివేల సంవత్సరాల కిందట ప్రకృతి వైపరిత్యాల కారనంగా హిమానీనదాలు కరిగిపోయాయి. దాంతో ఐర్లాండ్‌ ద్వీపం కొన్నేళ్ల వరకు మునిగిపోయిందని, అందువల్లే అక్కడ పాములు లేవని అంటుంటారు. పురావస్తు రికార్డుల ప్రకారం, బ్రిటన్‌, ఐర్లాండ్ దేశాల్లో పాములు లేవని తెలుస్తోంది. అయితే ఆ తర్వాత మరికొన్ని పరిశోధన కారణంగా ఈ దేశాల్లో మూడు రకాల పాము జాతులను గుర్తించారు. గడ్డి పాములు, ఎడ్డర్ పాములు, సాధారణ పాములు వంటి సరీసృపాలు జాతులు మాత్రమే ఇక్కడ ఉన్నాయట! అలాగే ఎన్నో రకాల అడవి జంతువులకు నిలయమైన న్యూజిలాండ్‌లో కూడా ఒక్క పాము కూడా కనిపించదట!

Updated On 24 Oct 2023 6:22 AM GMT
Ehatv

Ehatv

Next Story