భారతదేశ ప్రధానమంత్రి నరేంద్రమోదీకి(Narendra modi) రష్యాలో అరుదైన గౌరవం లభించింది.

భారతదేశ ప్రధానమంత్రి నరేంద్రమోదీకి(Narendra modi) రష్యాలో అరుదైన గౌరవం లభించింది. ఆ దేశ అత్యున్నత పౌర పురస్కారం ఆర్డర్ ఆఫ్ సెయింట్ ఆండ్రూ ది అపోస్టల్‌ను((Order Of Saint Andrwe the apostal) మోదీ అందుకున్నారు. మాస్కోలోని క్రెమ్లిన్‌లో జరిగిన వేడుకలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ చేతుల మీదుగా మోదీ ఈ పురస్కారం అందుకున్నారు. రష్యా-భారత్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మెరుగుపరచడంలో మోదీ చేసిన విశేష సేవను గుర్తిస్తూ ఈ అవార్డును ప్రకటించారు. 2019లోనే ఈ అవార్డును ప్రకటించినప్పటికీ ఇప్పుడు మోదీ స్వయంగా దీనికి అందుకోవడం విశేషం. ఈ అవార్డును అందుకున్న తొలి భారతీయుడు మోదీనే కావడం మరో విశేషం. ఈ సందర్భంగా మోదీని ప్రశంసించారు పుతిన్‌. అవార్డు అందుకున్న మోదీని హృదయపూర్వకంగా అభినందిస్తున్నామని, ఆయురారోగ్యాలతో, విజయాలు చేకూరాలని కోరుకుంటున్నానని చెప్పారు. రష్యా అత్యున్నత పౌర పురస్కారం స్వీకరించడం గౌరవంగా ఉందన్నారు మోదీ. ఈ అవార్డును , 140 కోట్ల మంది భారతీయులకు అంకితం ఇస్తున్నానని నరేంద్రమోదీ చెప్పారు.

Eha Tv

Eha Tv

Next Story