రష్యాలో అభివృద్ధి చేసిన "ఎంటరోమిక్స్" అనే mRNA ఆధారిత క్యాన్సర్ వాక్సిన్.

రష్యాలో అభివృద్ధి చేసిన "ఎంటరోమిక్స్" అనే mRNA ఆధారిత క్యాన్సర్ వాక్సిన్. ఇది ఇటీవల క్లినికల్ ట్రయల్స్‌లో 100% సక్సెస్‌ రేట్‌ సాధించింది. ఈ విషయాన్ని రష్యన్ అధికారులు ధృవీకరించినా కానీ ఇది ఇంకా పూర్తి స్థాయిలో అనుమతలు రాలేదు.

ఎంటరోమిక్స్, mRNA టెక్నాలజీ (కోవిడ్-19 వాక్సిన్‌ల్లో ఉపయోగించినదే). ఇది శరీరంలోని ఇమ్యూన్ సిస్టమ్‌ను ట్రైన్ చేసి, క్యాన్సర్ సెల్స్‌ను గుర్తించి, నాశనం చేయడానికి సహాయపడుతుంది. ప్రతి పేషెంట్‌కు తగిన మోతాదులో ఇస్తారు. రష్యా మెడికల్ మినిస్ట్రీ నేషనల్ మెడికల్ రీసెర్చ్ రేడియాలజికల్ సెంటర్, ఎంగెల్‌హార్డ్ట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మాలిక్యులర్ బయాలజీ (EIMB) కలిసి దీనిని రూపొందించారు.

"ఎంటరోమిక్స్" అని పిలవబడే ఈ వ్యాక్సిన్ నాలుగు నాన్-పాథోజెనిక్ (హానికరం కాని) వైరస్‌లతో తయారుచేశారు. అవి క్యాన్సర్ కణాలను టార్గెట్‌గా గుర్తించి వాటిని నాశనం చేస్తాయి. అంతే కాకుండా ఈ వైరస్‌లు రోగి యొక్క రోగనిరోధక వ్యవస్థను ఉత్తేజపరిచి, క్యాన్సర్‌ను మరింత సమర్థవంతంగా గుర్తించి పోరాడేలా చేస్తాయి. రెండు రకాలుగా దీని ద్వారా ఉపయోగం ఉంటుందని రష్యా అధికారులు ప్రకటించారు. ఒకటి ఆంకోలిసిస్ అనగా ట్యూమర్ ని నాశనం చేయడం. రెండు యాంటీ-ట్యూమర్ రోగనిరోధకశక్తిని యాక్టివేట్ చేయడం. కీమోథెరపీ లేదా రేడియేషన్‌కు భిన్నంగా, ఇది ఆరోగ్యకరమైన కణజాలాలను కాపాడుతుంది. క్లినికల్ ట్రయల్స్‌లో ఎలాటి సైడ్‌ ఎఫెక్ట్స్‌ చూపలేదు. రోగులు దీనిని బాగా తట్టుకున్నారు.

18-75 సంవత్సరాల వయస్సు గల 48 వాలంటీర్స్‌పై ఫేజ్-1 క్లినికల్ ట్రయల్స్ పూర్తిచేసారు. 100% సక్సెస్ రేట్ వచ్చింది. ఈ మొత్తం ట్రయల్స్ లో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఆ వాలంటీర్లు అందరూ కీమో థెరపీ, రేడియేషన్ లాంటి ఇతర ట్రీట్మెంట్స్ అన్నీ అయిపోయాక కూడా అడ్వాన్స్ స్టేజ్ క్యాన్సర్‌తో బాధపడుతున్నవారు. ఇది వైద్య రంగంలో గొప్ప విజయమని భావిస్తున్నారు. మిగిలిన క్లినికల్ ట్రయల్స్ పూర్తిచేసుకొని వీలైనంత త్వరలో బయటకు వస్తుంది. బయటకు వచ్చాక ఈ వ్యాక్సిన్ ని రష్యాలో ఉన్న క్యాన్సర్ బాధితులందరికీ ఫ్రీగా ఇవాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ వ్యాక్సిన్‌కు పూర్తిస్థాయిలో అనుమతులు రావాల్సి ఉంది.

ehatv

ehatv

Next Story