Saveera Prakash : పాకిస్తాన్ ఎన్నికల్లో తొలిసారి హిందూ మహిళ..!
పాకిస్తాన్‌లో(Pakistan) 2024 ఫిబ్రవరిలో జరిగే ఎన్నికల్లో(Elections) ఓ హిందూ మహిళ(Hindu Woman) పోటీలో ఉండనుంది. పాకిస్తాన్‌లో తొలి సారి ఎన్నికల బరిలో పోటీ చేసే హిందూ మహిళగా రికార్డులకెక్కనుంది. సవీరా ప్రకాష్(Savira Prakash) అనే మహిళ బునెర్ జిల్లాలోని పీకే-25(PK-25) జనరల్ స్థానంలో పోటీ చేసేందుకు నామినేషన్(Nomination) దాఖలు చేసింది. సవీరా ప్రకాష్ 2022లో పాకిస్తాన్‌లోని అబోటాబాద్ ఇంటర్నేషనల్ మెడికల్ కాలేజీలో(Abbottabad International Medical College) ఎంబీబీఎస్(MBBS) పూర్తి చేసింది. ఆమె తండ్రి ఓంప్రకాష్ కూడా వైద్యుడే.

Saveera Prakash
పాకిస్తాన్‌లో(Pakistan) 2024 ఫిబ్రవరిలో జరిగే ఎన్నికల్లో(Elections) ఓ హిందూ మహిళ(Hindu Woman) పోటీలో ఉండనుంది. పాకిస్తాన్‌లో తొలి సారి ఎన్నికల బరిలో పోటీ చేసే హిందూ మహిళగా రికార్డులకెక్కనుంది. సవీరా ప్రకాష్(Saveera Prakash) అనే మహిళ బునెర్ జిల్లాలోని పీకే-25(PK-25) జనరల్ స్థానంలో పోటీ చేసేందుకు నామినేషన్(Nomination) దాఖలు చేసింది. సవీరా ప్రకాష్ 2022లో పాకిస్తాన్‌లోని అబోటాబాద్ ఇంటర్నేషనల్ మెడికల్ కాలేజీలో(Abbottabad International Medical College) ఎంబీబీఎస్(MBBS) పూర్తి చేసింది. ఆమె తండ్రి ఓంప్రకాష్ కూడా వైద్యుడే. గత 35ఏళ్లుగా ఓంప్రకాస్ పాకిస్తాన్ పీపుల్స్ పార్టీలో కొనసాగుతున్నారు. కాగా ఆయన ప్రత్యక్ష ఎన్నికల్లో ఎప్పుడూ పోటీ చేయలేదు. ప్రస్తుతం సవీరా ప్రకాష్ పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ(Pakistan People's Party) మహిళా విభాగానికి ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తోంది. 16వ జాతీయ అసెంబ్లీ సభ్యుల కోసం వచ్చే ఏడాది ఫిబ్రవరి 8న సాధారణ ఎన్నికలు జరగనున్నాయి.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మానవులకు సేవ చేయడం నా రక్తంలోనే ఉంది. ఈ ప్రాంతంలోని పేదల అభ్యున్నతి కోసం పనిచేసేందుకు నా తండ్రి అడుగుజాడల్లో నడవాలనుకుంటున్నట్లు మీడియాకు ఆమె తెలిపింది. తన తండ్రి ప్రత్యక్ష రాజకీయాల్లో లేనప్పటికీ.. తాను ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్నానని తెలిపింది. పాకిస్తాన్ ఎన్నికల సంఘం కూడా ఎన్నికల సవరణలు చేపట్టింది. జనరల్ స్థానాల్లో మహిళలకు 5 శాతం సీట్లు కేటాయించాలని అక్కడి ఎన్నికల సంఘం ఆదేశించింది.
