Brazil Flight Accident : బ్రెజిల్లో విమాన ప్రమాదం.. ఏడుగురి మరణం
బ్రెజిల్‌లోని(Brazil) మినాస్ గైరోస్‌లో(Minas Gyros) ఘోర విమాన ప్రమాదం(Flight Accident) చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఏడుగురు చనిపోయారు. సావోపాలోలోని కంపినాస్ నగరం నుంచి బయలుదేరిన చిన్న విమానం ఇంజన్‌లో(Engine) సమస్య తలెత్తడంతో కుప్పకూలింది.

Brazil Flight Accident
బ్రెజిల్‌లోని(Brazil) మినాస్ గైరోస్‌లో(Minas Gerais) ఘోర విమాన ప్రమాదం(Flight Accident) చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఏడుగురు చనిపోయారు. సావోపాలోలోని కంపినాస్ నగరం నుంచి బయలుదేరిన చిన్న విమానం ఇంజన్‌లో(Engine) సమస్య తలెత్తడంతో కుప్పకూలింది. సింగిల్ ఇంజిన్‌తో నడిచే ఈ విమానం ఆదివారం ఉదయం 10.30 గంటలకు ఇటాపెవా నగర పరిధిలో గాలిలోనే పేలిపోయింది. విమానంలో ప్రయాణిస్తున్న వారిలో ఏడుగురు అక్కడికక్కడే మరణించారు. విమాన శకరాలు పర్వతం పక్కనే ఉన్న చెట్లపై, గడ్డిపై పడిపోయాయని స్థానికులు తెలిపారు. అయితే ప్రమాదానికి కారణాలు తెలియాల్సి ఉంటుంది.
