H-1B Visa Applicants : H1B దరఖాస్తు దారులకు షాక్ ఇచ్చిన ట్రంప్
అమెరికాలో టెక్ ఇండస్ట్రీలో పని చేయాలనుకునే ఇండియన్ IT ప్రొఫెషనల్స్‌కు షాకింగ్ న్యూస్.

అమెరికాలో టెక్ ఇండస్ట్రీలో పని చేయాలనుకునే ఇండియన్ IT ప్రొఫెషనల్స్‌కు షాకింగ్ న్యూస్. సింపుల్‌గా చెప్పాలంటే. H1B అనేది అమెరికాలోని కంపెనీలు విదేశీయులను హైర్ చేసుకోవడానికి ఉన్న వీసా. ప్రతి ఇయర్ లాటరీ సిస్టం ద్వారా 85,000 వీసాలు మాత్రమే అందుబాటులో ఉంటాయి ఇండియా నుంచి 70-75% వీసాలు వస్తున్నాయి, చైనా 12% మాత్రమే. ఇండియన్ కంపెనీలైన టీసీఎస్, ఇన్ఫోసిస్, అమెజాన్, గూగుల్ వంటి లాంటివి ఇది ఎక్కువగా యూజ్ చేస్తున్నాయి. ఇప్పుడు H1B వీసా అప్లై చేస్తే, ప్రతి ఏడాదికి $100,000 (సుమారు 84 లక్షల రూపాయలు) ఫీ చెల్లించాలి. ఇది కంపెనీ చెల్లించాల్సి ఉంటుంది. అంత పెట్టి ఉద్యోగులను కంపెనీలు హైర్ చేస్తాయా లేదా అన్ని ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది.
H-1B వీసా దరఖాస్తు వ్యవస్థ చాలా ఉపయోగకరమైనది కానీ దానికి అనేక వివాదాస్పద అంశాలు ఉన్నాయి. అమెరికాలో ఉద్యోగాల కోసం పోటితనం ఉండగా, కొన్ని సందర్భాల్లో కంపెనీలు H-1B వీసా ఉద్యోగులను తీసుకుని స్థానిక ఉద్యోగులను వదిలేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. H-1B కొత్త దరఖాస్తుల సంఖ్య చాలా ఎక్కువగా ఉన్నప్పుడు లాటరీ ద్వారా ఎంపిక జరుగుతుంది. తాజాగా, H-1B వీసా అప్లికేషన్‌పై $100,000 వార్షిక ఫీ వంటివి విధించారు. అమెరికాలో ఉన్న స్థానిక ఉద్యోగులతో పోల్చితే H-1B వీసా అభ్యర్థులకు తక్కువ వేతనం ఇచ్చే సందర్భాలు ఉన్నాయి. దీనివల్ల కంపెనీలు, మన ఉద్యోగాలను తక్కువ ఖర్చుతో వచ్చిన వాళ్లు తీసుకుంటున్నారు. H-1B వీసాల కోసం అప్లికేషన్లు ఎప్పుడూ పరిమితికి మించి వస్తాయి. అందుకే లాటరీ విధానం ద్వారా ఎంపిక జరుగుతుంది. H-1B హోల్డర్ ఉద్యోగం కోల్పోతే కేవలం 60 రోజుల్లో మాత్రమే ఉంటుంది.
ఆ సమయంలో కొత్త ఉద్యోగం దొరకకపోతే వెంటనే అమెరికా వదిలి వెళ్లాల్సి వస్తుంది. అంటే అసలు ఉద్యోగం లేకపోయినా అప్లై చేసి, వారిని ఇతర ప్రాజెక్టులకి ఔట్‌సోర్స్ చేస్తాయి. కొన్నిసార్లు తప్పుడు డాక్యుమెంట్స్ లేదా తప్పుడు వేతన వివరాలు ఇస్తారు. 2024 ఆర్థిక సంవత్సరంలో దాదాపు 4 లక్షల H-1B అప్లికేషన్లు వచ్చాయి. వీసా అప్లికేషన్ ఫీలను పెంచాలని, అలాగే అధిక వేతనం ఇచ్చే ఉద్యోగులకు ప్రాధాన్యం ఇవ్వాలని అమెరికా ప్రభుత్వం ఆలోచిస్తోంది. మభారతీయులపై H-1B మార్పుల ప్రభావం చాలా ఎక్కువగానే ఉంటుంది. ఎందుకంటే H-1B వీసాలకి దరఖాస్తు చేసేవారి లో భారతీయులే ఎక్కువ శాతం ఉంటారు. ప్రతి సంవత్సరం వచ్చే H-1B అప్లికేషన్లలో సగం కంటే ఎక్కువ భారతీయులవి. ప్రత్యేకంగా ఐటీ సెక్టార్ (Infosys, TCS, Wipro, HCL, Cognizant లాంటి కంపెనీలు) నుంచి ఎక్కువగా దరఖాస్తులు వస్తాయి.
దరఖాస్తులు లక్షల్లో వస్తాయి కానీ వీసాలు కేవలం 85,000 మాత్రమే ఉంటాయి. అందుకే చాలామంది భారతీయులు అర్హత ఉన్నప్పటికీ లాటరీలో ఎంపిక కావడం కష్టమవుతుంది. చిన్న ఐటీ కంపెనీలు, కన్సల్టెన్సీలు దీనివల్ల ఎక్కువగా ప్రభావితం అవుతాయి. అమెరికాలో ఐటీ layoffs పెరిగితే ఇది భారతీయులకి మరింత సవాలు అవుతుంది. మొత్తానికి, భారతీయులు H-1B వీసాపై అత్యధికంగా ఆధారపడుతున్నందున, ప్రతి చిన్న పాలసీ మార్పు కూడా వారిపై పెద్ద ప్రభావం చూపుతుంది.
