అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి కాల్పులు జరిగాయి. లాస్‌ వెగాస్‌లోని రెండు అపార్ట్‌మెంట్‌ కాంప్లెక్స్‌లలో ఓ వ్యక్తి కాల్పులు జరిపాడు.

అగ్రరాజ్యం అమెరికా(America)లో మరోసారి కాల్పులు జరిగాయి. లాస్‌ వెగాస్‌(Shooter Dies By Suicide After 5 People, 13 Year Old Across Two Apartment Complexes Killed In Las Vegas)లోని రెండు అపార్ట్‌మెంట్‌ కాంప్లెక్స్‌లలో ఓ వ్యక్తి కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో అయిదుగురు అమాయకులు ప్రాణాలు విడిచారు. చనిపోయిన వారిలో ముగ్గురు మహిళలతో పాటు 13 ఏళ్ల బాలిక ఉంది. ఈ పాతకానికి పాల్పడింది 47 ఏళ్ల ఎరిక్‌ ఆడమ్స్‌(Eric Adams). అయిదుగురిని కాల్చి చంపిన కొన్ని గంటలకే నిందితుడు తనను తాను కాల్చుకుని చనిపోయాడని పోలీసులు తెలిపారు. ఒకే కాంప్లెక్స్‌లోని రెండు వేర్వేరు అపార్ట్‌మెంట్లలో అడమ్స్‌ కాల్పులు జరిపాడు. అతడు కాల్పులు ఎందుకు జరిపాడో తెలియదు. అయితే గత కొన్ని రోజులుగా అమెరికాలో వరుసగా ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి.అమెరికాలో కాల్పుల కలకలం, అయిదురుగు మృతి

Updated On
Eha Tv

Eha Tv

Next Story