Gun Fire In America : అమెరికాలో కాల్పుల మోత.. ఆరుగురు మృతి
అమెరికాలోని ఈశాన్య మెక్సికన్ నగరం కాల్పుల మోతలో దద్దరిల్లింది. మోంటెర్రీలో ఇద్దరు మహిళలు సహా ఆరుగురు వ్యక్తులు కాల్పుల ఘటనలో మృతిచెందారని పోలీసు అధికారులు తెలిపారు. మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు తెలిపారు. అర్ధరాత్రి తుపాకీ శబ్దాలు విన్న స్థానికులు భయాందోళనలకు గురయ్యారని పేర్కొన్నారు

Six People Shot Dead In Mexican Industrial Hub
అమెరికా(America)లోని ఈశాన్య మెక్సికన్(Mexican) నగరం కాల్పుల(Gunshot) మోతలో దద్దరిల్లింది. మోంటెర్రీ(Monterrey)లో ఇద్దరు మహిళలు సహా ఆరుగురు వ్యక్తులు కాల్పుల ఘటనలో మృతిచెందారని పోలీసు అధికారులు తెలిపారు. మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు తెలిపారు. అర్ధరాత్రి తుపాకీ శబ్దాలు విన్న స్థానికులు భయాందోళనలకు గురయ్యారని పేర్కొన్నారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సివుంది. మోంటెర్రే యుఎస్ సరిహద్దు(US Boarder) నుండి 160 కిలోమీటర్లు (100 మైళ్ళు) దూరంలో ఉన్న న్యూవో లియోన్(Nuevo Leon) రాష్ట్రంలోని ఓ పారిశ్రామిక ప్రాంతం(Industrial Hub). కేసు నమోదు చేసుకున్న పోలీసులు(Police) దర్యాప్తు చేస్తున్నారు.
సోమవారం రాత్రి కూడా ఫిలడెల్ఫియా(Philadelphia)లో కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో నలుగురు చనిపోయారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు కస్టడీలో ఉన్నాడని, బాలిస్టిక్ చొక్కా ధరించి ఉన్నాడని పోలీసులు ఒక ప్రకటన విడుదల చేశారు.
