ఓ దొంగ.. అంటే దొంగ అనొచ్చో లేదో కానీ.. పరిస్థితుల ప్రభావంతో ఓ ఆలయంలో దొంగతనం చేశాడు.

ఓ దొంగ.. అంటే దొంగ అనొచ్చో లేదో కానీ.. పరిస్థితుల ప్రభావంతో ఓ ఆలయంలో దొంగతనం చేశాడు. ఆ తర్వాత రియలైజ్‌ అయ్యాడు. 27 ఏళ్ల తర్వాత తిరిగి సొమ్మును హుండీలో వేసి లేఖరాసి క్షమాపణ కోరాడు. దక్షిణ కొరియా(South Korean)లోని ఓ ఆలయంలో హుండీ తెరవగా ఆలయ సిబ్బంది లేఖతో పాటు డబ్బును కనుగొన్నారు. 1997లో 30 వేల ఓన్‌లు దొంగతనం చేశాడు. అంటే మన కరెన్సీలో 18 వందల రూపాయలు. కానీ అతను తిరిగి 2 మిలియన్ల వోన్లు (దాదాపు రూ. 1.25 లక్షలు) హుండీలో వేశాడు.

1997లో ఆసియా ఆర్థిక సంక్షోభం దక్షిణ కొరియా ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపింది. టోంగ్‌డోసా టెంపుల్‌(Tongdo Temple)లోని జజంగం హెర్మిటేజ్ (Jajangam Hermitage)నుండి 30,000 దొంగతనం చేశాడు. ఆ వ్యక్తి తన పేరు లేదా ఇతర వివరాలను లేఖలో వెల్లడించలేదు. 27 సంవత్సరాల క్రితం తాను చేసిన పనికి చింతిస్తున్నానని, తన జీవితంలో ఒక కీలకమైన క్షణం వచ్చిన తర్వాత కష్టపడి పనిచేసి "గౌరవప్రదమైన జీవితాన్ని" జీవించానని చెప్పాడు.

లేఖను ఉటంకిస్తూ, ఆ వ్యక్తి తొలిసారి విజయవంతంగా దొంగిలించాడని.. మరోసారి దొంగతనం చేయడానికి ప్రయత్నించగా ఒక సాధువు తనను పట్టుకున్నాడని.. అయితే అతను పోలీసులకు అప్పగించలేదు.. తల్లిదండ్రులకు కూడా చెప్పలేదు, కానీ అతని భుజంపై చేయి వేసి, "కళ్ళు మూసుకుని, నిశ్శబ్దంగా తల ఊపాడు' అంటూ లేఖలో రాశాడు. “ఆ రోజు నుంచి నేను నాది కాని దేనినీ కోరుకోలేదని.. సాధువు తనను సక్రమంగా ఉండాలని సూచించినట్లు అనుకున్నానని తెలిపాడు. 2 మిలియన్ వోన్ తిరిగి ఆలయానికి ఇవ్వడం ద్వారా రుణం తీర్చుకుంటున్నానని, త్వరగా ఇవ్వనందుకు క్షమించాలని ఆ వ్యక్తి లేఖలో పేర్కొన్నాడు. తాను బిడ్డ కోసం ఎదురుచూస్తున్నానని, బిడ్డ గర్వపడేలా తండ్రి కావాలని కోరుకుంటున్నానని చెప్పాడు.

Updated On
ehatv

ehatv

Next Story