ప్రపంచంలోనే భారత్‌ నంబర్‌వన్‌గా నిలవాలని అనుకున్నాం. ఆ ముచ్చట ఇన్నాళ్లకు తీరింది. ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశంగా భారత్‌ నిలిచింది. ప్రస్తుతం భారత్‌ జనాభా 142.86 కోట్లు అయితే, మొన్నటి వరకు టాప్‌లో ఉన్న చైనా జనాభా ఇప్పుడు 142.57 కోట్లు మాత్రమే. అంటే చైనా కంటే భారత్‌లో 29 లక్షల మంది ఎక్కువున్నారన్నమాట! 1950లో ఐక్యారాజ్య సమితి జనాభా సమాచారాన్ని వెల్లడించడం మొదలుపెట్టిన తర్వాత ప్రపంచ జనాభా జాబితాలో భారత్‌ తొలిసారిగా ఫస్ట్‌ ప్లేస్‌లో నిలిచింది.

ప్రపంచంలోనే భారత్‌ నంబర్‌వన్‌గా నిలవాలని అనుకున్నాం. ఆ ముచ్చట ఇన్నాళ్లకు తీరింది. ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశంగా భారత్‌ నిలిచింది. ప్రస్తుతం భారత్‌ జనాభా 142.86 కోట్లు అయితే, మొన్నటి వరకు టాప్‌లో ఉన్న చైనా జనాభా ఇప్పుడు 142.57 కోట్లు మాత్రమే. అంటే చైనా కంటే భారత్‌లో 29 లక్షల మంది ఎక్కువున్నారన్నమాట! 1950లో ఐక్యారాజ్య సమితి జనాభా సమాచారాన్ని వెల్లడించడం మొదలుపెట్టిన తర్వాత ప్రపంచ జనాభా జాబితాలో భారత్‌ తొలిసారిగా ఫస్ట్‌ ప్లేస్‌లో నిలిచింది. జనాభా అంచనాలకు సంబంధించి స్టేట్‌ ఆఫ్‌ వరల్డ్‌ పాపులేషన్‌ రిపోర్టు-2023(State of World Population 2023) పేరుతో యునైటెడ్‌ నేషన్స్‌ పాపులేషన్‌ ఫండ్స్‌ (UNFPA) ఇచ్చిన నివేదిక ప్రకారం భారత్‌లో అత్యధికంగా 142.86 కోట్ల జనాభా ఉంది. ఇక ప్రపంచంలో మూడోస్థానంలో ఉన్న అమెరికాలో 34 కోట్ల మంది ఉన్నట్లు UNFPA అంచనా వేసింది.

ప్రపంచ జనాభా 804.5 కోట్లు ఉంటే అందులో మూడులో ఒకటో వంతు జనాభా కేవలం భారత్‌, చైనాలోనే ఉంది. కొంతకాలంగా చైనాలో జనాభా పెరుగుదల బాగా తగ్గింది. భారత్‌లో కూడా కొంతమేరకు తగ్గుదల కనిపిస్తోంది. 2011 నుంచి భారత జనాభాలో సరాసరి 1.2 శాతం పెరుగుతూ వస్తోంది. అంతకుముందు పదేళ్లు మాత్రం ఈ పెరుగుదల 1.7 శాతంగా ఉంది. భారత్‌లో జనాభా ఇలా వేగంగా పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. సామాన్యులు భయపడిపోతున్నారు. దీనికి అడ్డుకట్ట పడితే బాగుండని కోరుకుంటున్నారు.

Updated On 19 April 2023 3:49 AM GMT
Ehatv

Ehatv

Next Story