British man Drunk and died at night club:అతిగా మద్యం సర్వ్ చేసి .. డబ్బుని దొంగిలించి ప్రాణాలు తీస్తున్న నైట్ క్లబ్స్ .!
పోలాండ్(Poland) నైట్ క్లబ్ లో దారుణం చోటుచేసుకుంది . మోతాదుకు మించి మద్యం తాగించి ఒక ప్రాణాన్ని బలిగొన్నారు క్లబ్ యాజమాన్యం . మద్యం మత్తులో ఉన్న మనుషుల నుండి నగదుని కూడా దొంగిలిస్తున్నారు క్లబ్ సిబ్బంది . నైట్ క్లబ్ లోని ఈ దారుణాలు రోజు రోజుకి మితిమీరుతున్నట్లు అక్కడి పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు .

shots

బ్రిటిష్( British )కి చెందిన మార్క్ సి(Mark C )అనే వ్యక్తి తనస్నేహితుడితో కలిసి కరుకౌలోని(Krakow), వైల్డ్ నైట్స్ (Wild Nights)అనే క్లబ్ కి వెళ్ళాడు . అతిగా మద్యం సేవించాడు . అయిన కూడా క్లబ్ సిబ్బంది ఆగకుండా అతనికి షాట్స్ సర్వ్ చేస్తూనే ఉన్నారు . దాదాపు 90 నిమిషాల్లో 22 షాట్స్ ని తీసుకున్నాడు ఆ వ్యక్తి . అతిగా మద్యం సేవించటంతో అపస్మారక స్థితికి చేరుకున్నాడు. అలంటి పరిస్థితిలో అతనికి సరైన వైద్య సహాయం కూడా ఇవ్వకపోగా ,సదరు వ్యక్తి నుండి 420 పౌండ్లు అతనిజేబు నుండి దోచుకోవడం విచారకరం .మరణించిన వ్యక్తి రక్తంలో 0. 4శాతం ఆల్కహాల్ ని గుర్తించినట్లు సమాచారం .ఇది సాధారణం కంటే ప్రమాదకరమని డాక్టర్లు చెప్పడం జరిగింది .
విషయం తెలిసి ఘటన స్థలం కి చేరుకున్న పోలీసులు మార్క్ సి మరణానికి సంబంధించి అతనికి అతిగా మద్యం అందించిన క్లబ్ యాజమాన్యం సిబ్బంది ఇలా మొత్తం 58 మందిని అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టినట్లు సమాచారం .అలాగే ధనవంతులైన వ్యక్తులను పసిగట్టి వారి దగ్గర నుండి డబ్బుని కాజేయటానికి ఈ నైట్ క్లబ్బులు ఇలాంటి దారుణాలనికి పాల్పడుతున్నట్లు
పోలిస్ సెంట్రల్ పోలీస్ ఇన్వెస్టిగేషన్ బ్యూరోThe Polish Central Police Investigation Bureau (CBSP) (CBSP) వెల్లడించింది.