Sunita Williams : అంతరిక్ష కేంద్రంలో సునితా విలియమ్స్ డాన్స్
సునితా విలియమ్స్(Sunita Williams) ఆనందతాండవం చేశారు. ఇక్కడ కాదు అంతరిక్ష కేంద్రంలో..స్పేస్ స్టేషన్(Space Station)లో తన సంతోషాన్ని నృత్యం ద్వారా తెలుపుకున్నారు. భారతీయ మూలాలు ఉన్న ఆస్ట్రోనాట్ సునితా విలియమ్స్ బోయింగ్ స్టార్‌లైనర్‌లో అంతరిక్ష కేంద్రానికి వెళ్లారు.

Sunita Williams
సునితా విలియమ్స్(Sunita Williams) ఆనందతాండవం చేశారు. ఇక్కడ కాదు అంతరిక్ష కేంద్రంలో..స్పేస్ స్టేషన్(Space Station)లో తన సంతోషాన్ని నృత్యం ద్వారా తెలుపుకున్నారు. భారతీయ మూలాలు ఉన్న ఆస్ట్రోనాట్ సునితా విలియమ్స్ బోయింగ్ స్టార్‌లైనర్‌లో అంతరిక్ష కేంద్రానికి వెళ్లారు. అక్కడ సహచర వ్యోమగాములను కలుసుకున్న తర్వాత తెగ ఆనందపడ్డారు. ఇంతకు ముందు వినాయకుడి విగ్రహం, భగవద్గీతతో అంతరిక్షంలోకి వెళ్లిన 59 ఏళ్ల సునితా విలియమ్స్ మూడోసారి స్పేస్ స్టేషన్‌కు వెళ్లారు. స్పేస్ స్టేషన్‌కు వెళ్లిన ఆనందంలో డాన్స్ చేశారు. అక్కడ ఉన్న ఏడుగురు ఆస్ట్రోనాట్స్‌ను ఆలింగనం చేసుకున్నారు. బోయింగ్ స్టార్‌లైనర్‌లో విలియమ్స్‌తో పాటు విల్మోర్ కూడా వెళ్లారు.
