National Porn Ban : పోర్నోగ్రఫీని నిషేధిస్తారా.. నేపాల్ తరహా ఉద్యమాన్ని తెస్తారా? CJI కీలక వ్యాఖ్యలు..!
శృంగారంపై అవగాహన కోసం వేల ఏళ్ల క్రితం రాజులు గుళ్లలో బొమ్మలు వేయించేవారు.

శృంగారంపై అవగాహన కోసం వేల ఏళ్ల క్రితం రాజులు గుళ్లలో బొమ్మలు వేయించేవారు. రాతితో శిల్పాలను చెక్కించేవారు. ఆరోజుల్లో శృంగారం గురించి ఒకరినొకరు చర్చించుకునేవారుకాదు, అందుకోసం కొత్తగా పెళ్లయినవాళ్లు గుడికి వెళ్లడం ఆనవాయితీ, అక్కడ ఉన్న శిల్పాలను చూసి శృంగారంపై అనుభవం పెంచుకునేవారు. ఆ తర్వాతి కాలంలో శృంగారంలో పుస్తకాలు వచ్చేవి. ఆ పుస్తకాలు కొనుక్కొని ఎవరి కంటబడకుండా చాటుమాటుగా చదివేవారు. ఆ కాలంలో పుస్తకాలే మార్గం. దీన్ని బూతు సాహిత్యంగా చెప్పేవారు. అప్పట్లో కొన్ని భాషల్లో బూతు సినిమాలు అంటే అడల్ట్ మూవీస్ వచ్చేవి. ఆ తర్వాత కాలంలో సినిమాల రూపంలో వచ్చేవి. ఎప్పుడైతే కంప్యూటర్లు, ఇంటర్నెట్, సెల్ఫోన్లు మొదలైనవి విస్తారంగా అందుబాటులోకి వచ్చాక పోర్న్వీడియోలు, సినిమాలు చూడటం సులభమైపోయింది. సెల్ఫోన్ కారణంగా ఎక్కడంటే అక్కడ పోర్న్చూసే అవకాశం దొరికింది. చివరకు ప్రజాప్రతినిధులు సైతం చట్టసభల్లో పోర్న్వీడియోలు చూస్తున్నారు. ఒకప్పుడు పోర్న్అంటే విదేశాలకు సంబంధించిన కంటెంట్మాత్రమే ఉండేది. కాని కాలం మారుతున్న కొద్దీ భారత్లో కూడా పోర్న్ వీడియోలు విస్తారంగా తయారవుతున్నాయి. అయితే పోర్న్ వీడియోలతో యువత రెచ్చిపోతున్నారనేది ఇప్పుడు నడుస్తోన్న చర్చ. మద్యం మత్తులో ఉంటూ మనుషులం అని మర్చిపోతున్నారు. చిన్న చిన్న పిల్లల మీద అత్యాచారాలు చేయడంతో ఇప్పుడు తల్లి తండ్రులు భయపడిపోతున్నారు. ప్రభుత్వాలు కఠిన చట్టాలు తీసుకొచ్చి పోర్న్ వీడియోల బారి నుంచి యువతను కాపాడాల్సిన అవసరం ఉందని పలువురు వాపోతున్నారు.
తాజాగా పోర్నోగ్రఫీని నిషేధించాలని కోరుతూ సుప్రీం కోర్టులో పిటిషన్ వేశారు. అయితే ఈ పిటిషన్‌ను విచారణకు తీసుకోవడానికి సుప్రీంకోర్టు అయిష్టత వ్యక్తం చేసింది. ప్రధాన న్యాయమూర్తి బీఆర్ గవాయి నేతృత్వంలోని ఇద్దరు న్యాయమూర్తుల ధర్మాసనం ఈ పిటిషన్‌పై వ్యాఖ్యానిస్తూ ఇండియాలో పోర్నోగ్రఫీని నిషేధిస్తే నేపాల్ తరహా ఉద్యమం వస్తే ఏంటి అని ప్రశ్నించారు. ‘ నేపాల్లో సోషల్ మీడియాను నిషేధిస్తే ఏం జరిగిందో చూశారు కదా’ అని అని వ్యాఖ్యానించింది. దీనిపై నాలుగు వారాల తర్వాత విచారణ జరుపుతామని ధర్మాసనం తెలిపింది. కాని అప్పటికి ప్రధాన న్యాయమూర్తి గవాయి పదవీ విరమణ చేస్తారు. తర్వాత వచ్చే చీఫ్ జస్టిస్ ఈ పిటిషన్‌పై విచారణ జరిపి పోర్నోగ్రఫీని నిషేధం విధిస్తారా లేదా అనేది ఉత్కంఠగా మారుతోంది.


