✕
Taiwan Lantern festival : తైవాన్‌లో రేపు వెలుగుల పండుగ.. ఆకాశంలో వేలాది స్కైలాంతర్లు
By EhatvPublished on 23 Feb 2024 2:00 AM GMT
రాత్రివేళ ఆకాశంలో మిరుమిట్లు గొలుపుతూ ఎగురుతున్న స్కై లాంతర్లు చూస్తే కనువిందుగా ఉంటుంది కదూ! ఆ సుందర దృశ్యాలను చూడాలంటే అర్జెంటుగా తైవాన్‌కు(Taiwan) వెళ్లాలి. శనివారం అంటే ఫిబ్రవరి 24వ తేదీన అక్కడ కొత్త సంవత్సర వేడుకలు ఘనంగా జరగబోతున్నాయి. ఈ సందర్భంగా లాంతర్ ఫెస్టివల్(Lantern festival) కూడా జరుగుతుంది. ఏటా పండుగలా జరుపుకునే ఈ కార్యక్రమంలో వేల మంది పర్యాటకులు ఉత్సాహంగా పాల్గొంటుంటారు

x
Taiwan Lantern festival
-
- రాత్రివేళ ఆకాశంలో మిరుమిట్లు గొలుపుతూ ఎగురుతున్న స్కై లాంతర్లు చూస్తే కనువిందుగా ఉంటుంది కదూ! ఆ సుందర దృశ్యాలను చూడాలంటే అర్జెంటుగా తైవాన్‌కు(Taiwan) వెళ్లాలి. శనివారం అంటే ఫిబ్రవరి 24వ తేదీన అక్కడ కొత్త సంవత్సర వేడుకలు ఘనంగా జరగబోతున్నాయి. ఈ సందర్భంగా లాంతర్ ఫెస్టివల్(Lantern festival) కూడా జరుగుతుంది. ఏటా పండుగలా జరుపుకునే ఈ కార్యక్రమంలో వేల మంది పర్యాటకులు ఉత్సాహంగా పాల్గొంటుంటారు. కొత్త సంవత్సరం అంటే సమస్త మానవాళికి పండుగే! ఆ పర్వదినాన్ని ఒక్కొక్కరు ఒక్కో రీతిలో జరుపుకుంటారు.
-
- కాకపోతే సంబరాల్లో మాత్రం అంతగా తేడా ఉండదు. ప్రస్తుతం తైవాన్ కొత్త ఏడాది సంబరాల్లో(New Year Celebrations) మునిగిపోయింది. తైవాన్‌లోని తైపీ(Taipi) నగరంలో జరిగే స్కైలాంతర్ల వేడుకే(Skylanterns Celebrations) అపురూపంగా, అద్భుతంగా ఉంటుంది. ఒకటా రెండా వేనవేల స్కైలాంతర్లు ఆకాశంలో వివహరిస్తాయి. నింగిలో వెలుగులు నింపుతాయి. దేదీప్యమానంగా వెలుగులీనుతున్న నక్షత్రాల్లా మెరుస్తాయి. తారలు దిగివచ్చినట్టుగానే ఉంటుంది.తైపీకి దగ్గరలోనే పింగ్సీ అనే బుజ్జి పట్టణం ఉంది. అక్కడే ఈ వేడుకలు వైభవోపేతంగా జరుగుతాయి.. ఇలా లాంతర్లను ఆకాశంలో వదలడమన్నది ఇప్పుడు పుట్టిన వేడుక కాదు.. దీనికి రెండు వేల ఏళ్ల చరిత్ర ఉంది.
-
- దానికో కారణం కూడా ఉంది.. అప్పట్లో తైపీ చుట్టుపక్కల ఊళ్లపై బందిపోటు దొంగలు పడేవారట! మొత్తం ఊడ్చుకుని వెళ్లేవారట! సంపాదించిన సొత్తంతా దొంగలమయం అవుతుండటంతో అన్ని గ్రామాల ప్రజలు కలిసి ఓ కాపలాదారుణ్ణి పెట్టుకున్నారట! గ్రామాల్లోకి దొంగలు రాకముందే జనమంతా ఊళ్లు ఖాళీ చేసి సమీపంలో ఉన్న కొండల్లో తలదాచుకునేవారట! దొంగలు వెళ్లిన తర్వాతే ఊళ్లోకి వచ్చేవారట! మరి దొంగలు వెళ్లిపోయారన్న విషయం వారికి తెలియాలి కదా! అందుకే కాపాలదారు నిప్పు బెలూన్లను గాల్లోకి వదిలేవారట! నిప్పు బెలూన్లు గాల్లో కనిపించగానే జనం ఊళ్లోకి వచ్చేవారట! అప్పట్నుంచి అలా అలా వెలుగు బెలూన్లు వదలడం మొదలయ్యి ఇలా లాంతర్ ఫెస్టివల్ వరకు వచ్చింది.
-
- ఈ ఉత్సవంలో ఎంతలేదన్నా ఓ రెండు లక్షల స్కైలాంతర్లు ఆకాశంలో ఎగురుతాయి. అసలీ వేడుకను చూసేందుకే కొన్ని వేల మంది పర్యాటకులు తైపీకి వస్తుంటారు. స్కై లాంతర్లను వదిలేటప్పుడు జనం తమ కోరికలను వాటిపై రాస్తారు. అలా చేయడం వల్ల తమ కోరికలు తప్పకుండా నెరవేరుతాయన్న గట్టి నమ్మకం వారిది! స్కై లాంతరు తయారీకి కావాల్సిన వస్తువులు ఆయిల్రైస్ పేపర్. వెదురుపుల్లలు.
-
- పెద్ద క్యాండిల్ అంతే.! పెద్ద కష్టమైన పనేమీ కాదు కాబట్టే లక్షల లాంతర్లు నింగినెగురుతాయి. స్కై లాంతర్ల ఉత్సవాన్ని తైవాన్ ప్రభుత్వం చాలా ప్రిస్టేజియస్‌గా తీసుకుంటుంది. విదేశీ టూరిస్టులను ఆకట్టుకోవడం కోసం సకల వసతులను ఏర్పాటుచేస్తుంది.. అందుకే కాబోలు సెకండ్ లార్జెస్ట్ నైట్‌టైమ్ ఫెస్టివల్ ఇన్ వరల్డ్ అని ఈ వేడుకకు పేరొచ్చింది.. అంటే ప్రపంచవ్యాప్తంగా రాత్రివేళల్లో జరిగే గొప్ప ఉత్సవాలలో ఇది రెండోదట!

Ehatv
Next Story