ఏఐ చాట్‌బాట్‌తో(AI Chatbot) ఓ 14 ఏళ్ల బాలుడు ప్రేమలో కూరుకుపోయాడు.

ఏఐ చాట్‌బాట్‌తో(AI Chatbot) ఓ 14 ఏళ్ల బాలుడు ప్రేమలో కూరుకుపోయాడు. అందులోంచి బయటపడలేకపోయాడు. తట్టుకోలేక ఆత్మహత్య(Suicide) చేసుకున్నాడు. చాట్‌బాట్‌ డేనెరిస్‌ టార్గారియన్‌తో(Daenerys Targaryen) మాట్లాడిన తర్వాత తన కొడుకు ఆత్మహత్య చేసుకున్నట్టు తల్లి గుర్తించింది. ఆ క్యారెక్టర్‌ సృష్టికర్త అయిన కంపెనీతో పాటు గూగుల్‌పై(Google) కూడా కేసు పెట్టింది. గేమ్‌ ఆఫ్‌ థ్రోన్స్‌(Game of thrones) సిరీస్‌లోని క్యారెక్టర్‌ అయిన టార్గారియన్‌ పేరుతో సృష్టించిన ఈ చాట్‌బాట్‌కు ఆ బాలుడు సెవెల్‌ సెట్టెర్‌ బానిస అయ్యాడు. ఈ ఏడాది ఫిబ్రవరిలో దాంతో కాసేపు ముచ్చటించాడు. తర్వాత తన పెంపుడి తండ్రి హ్యాండ్‌గన్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తన కొడుకు మరణానికి చాట్‌బాటే కారణమని, దాన్ని సృష్టించిన కంపెనీతోపాటు గూగుల్‌ మాతృసంస్థ ఆల్ఫాబెట్‌పై(Alphabet) ఫ్లోరిడా ఫెడరల్‌ కోర్టులో చనిపోయిన బాలుడి తల్లి మేగాన్‌ దావా వేశారు. చాట్‌బాట్‌ తన కుమారుడిని మానవరూప, హైపర్‌ సెక్యువలైజ్డ్‌, భయపెట్టే వాస్తవిక అనుభవాలతో లక్ష్యంగా చేసుకుందని ఆమె తన పిటిషన్‌లో ఆరోపించారు. క్యారెక్టర్‌ ఏఐ ఉత్పత్తుల డెవలప్‌మెంట్‌లో తమ ప్రమేయం ఏమీ ఉండదని గూగుల్‌ అంటోంది..

Updated On
Eha Tv

Eha Tv

Next Story