✕
South Africa : దక్షిణాఫ్రికాలో తెలంగాణ యువకుడిని కిడ్నాప్ చేసిన ఉగ్రవాదులు
By ehatvPublished on 6 Dec 2025 5:59 AM GMT
ఉపాధి కోసం దక్షిణాఫ్రికా వెళ్లిన భువనగిరి యువకుడిని జేఎన్ఐఎం ఉగ్రవాదులు కిడ్నాప్ చేశారు.

x
ఉపాధి కోసం దక్షిణాఫ్రికా వెళ్లిన భువనగిరి యువకుడిని జేఎన్ఐఎం ఉగ్రవాదులు కిడ్నాప్ చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని బండసోమారం గ్రామంలో నివాసముంటూ, హైదరాబాద్ నగరంలోని ఒక బోర్ వెల్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్న ప్రవీణ్(23) అనే యువకుడుగత ఏడాది కంపెనీ పని మీద దక్షిణాఫ్రికాలోని మాలి దేశానికి ప్రవీణ్ వెళ్లాడు. గత నెల 22వ తేదీ నుండి ప్రవీణ్ ఫోన్ స్విచాఫ్ రావడంతో అతని తల్లిదండ్రులు భయాందోళన చెందారు. గత నెల 23వ తేదీన విధులు ముగించుకుని తిరిగి ఇంటికి వెళ్తున్న క్రమంలో, జేఎన్ఐఎం ఉగ్రవాదులు ప్రవీణ్‌ను కిడ్నాప్ చేసినట్టు తెలిపిన బోర్ వెల్ కంపెనీ యాజమాన్యం. దక్షిణాఫ్రికా దేశంతో సంప్రదింపులు జరిపి తమ కొడుకును ఎలాగైనా స్వదేశానికి తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్న ప్రవీణ్ తల్లిదండ్రులు

ehatv
Next Story

