కరీంనగర్‌కు చెందిన 27 ఏళ్ల షహబాజ్‌ ఖాన్‌ సౌదీ అరేబియాలోని ఎడారిలో దయనీయ స్థితిలో చనిపోయాడు.

కరీంనగర్‌కు(Karimnagar) చెందిన 27 ఏళ్ల షహబాజ్‌ ఖాన్‌ సౌదీ అరేబియాలోని(Saudhi arabia) ఎడారిలో దయనీయ స్థితిలో చనిపోయాడు. అల్‌ హాసాలో ఓ టెలిఫోన్‌ కంపెనీలో టవర్‌ టెక్నిషియన్‌గా(Tower technician) పని చేస్తున్న ఆ యువకుడు అయిదు రోజుల కిందట విధి నిర్వహణలో భాగంగా సుడాన్‌ దేశానికి సహచరుడితో కలిసి కారులో ఓ చోటుకు వెళ్లారు. జీపీఎస్‌ లోకేషన్‌ ఆధారంగా కారు నడుపుతూ వెళితే అక్కడికి చేరారు. అది ఎంత ప్రమాదకరమైన ప్రదేశమో వారికి తెలియదు. దాన్ని ఖళీ క్వార్టర్‌ అంటారు. అరబిక్‌ భాషలో రబ్‌ అల్‌ ఖలీ. ఈ ఏడారిలో దారితప్పితే మరణమే దిక్కు. కారులో పెట్రోల్‌తో పాటు కడుపులో తిండి, నీళ్లు కూడా అయిపోయాయి. చివరకు మొబైల్‌ ఛార్జింగ్‌ కూడా అయిపోయింది. జీవితంపై ఆశలు అడుగంటిపోయిన ఆ ఇద్దరు కారు దగ్గరే ఇసుకలో చాప పరుచుకుని నమాజ్‌ చేస్తూ చనిపోయారు. వీరి గల్లంతుపై ఫిర్యాదు అందుకున్న పోలీసులు హెలికాప్టర్ల సాయంతో గాలించి.. నమాజ్‌ చేసే చాపపై పడి ఉన్న మృతదేహాలను కనుగొన్నారు.

Updated On
Eha Tv

Eha Tv

Next Story